Neha Shetty : OG కి టిల్లు బ్యూటీ గ్లామర్ డోస్.. ఫ్యూజులు ఎగిరిపొవాల్సిందేనా..?
ప్రధానాంశాలు:
Neha Shetty : OG కి టిల్లు బ్యూటీ గ్లామర్ డోస్.. ఫ్యూజులు ఎగిరిపొవాల్సిందేనా..?
Neha Shetty : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా కూడా పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మేక్ర్స్. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో సుజిత్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. స్వతహాగా పవర్ స్టార్ ఫ్యాన్ అయిన సుజిత్ ఆయన్ను ఎలా చూపించాలి.. ఎలా చూపిస్తే ఫ్యాన్స్ సూపర్ అంటారన్నది దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా చేస్తున్నాడు.
ఐతే ఓజీ సినిమా లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో ఆమె గ్లామర్ సరిపోదు అని మరో అందాల భామతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారని తెలుస్తుంది. ఓజీ స్పెషల్ సాంగ్ కోసం ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టిని ఫైనల్ చేశారట. సినిమాలోనే తన పాత్ర కోసం ఒక రేంజ్ లో రెచ్చిపోయే నేహా ఇక స్పెషల్ సాంగ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు.
Neha Shetty ఐటం సాంగ్ కి ఓకే..
డీజే టిల్లులో రాధిక పాత్రతో అదరగొట్టిన అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ సినిమాలో ఐటం సాంగ్ కి ఓకే అయ్యిందట. అదే జరిగితే మాత్రం అమ్మడి దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. నేషనల్ లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఓజీ సినిమాలో నేహా శెట్టి ఐటం సాంగ్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు. కచ్చితంగా ఈ సాంగ్ అమ్మడి కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అనగానే అమ్మడు కూడా మారు మాట మాట్లాడలేదని తెలుస్తుంది. మరి ఈ సాంగ్ నేహా కెరీర్ కు ఎంత హెల్ప్ అవుతుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. Kalyan, Pawan Kalyan, OG, Neha Shetty