Tabu : మనసు మార్చుకున్న టబు.. ఈ ఏజ్‌లో రొమాంటిక్ మూడ్ ఏంటన్న నెటిజన్స్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tabu : మనసు మార్చుకున్న టబు.. ఈ ఏజ్‌లో రొమాంటిక్ మూడ్ ఏంటన్న నెటిజన్స్?

 Authored By mallesh | The Telugu News | Updated on :5 October 2022,3:40 pm

Tabu : సీనియర్ హీరోయిన్ టబు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఇండస్ట్రీని తన ఒర కళ్లతో ఏలిన ఈ పొడుగు కాళ్ల సుందరి టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ వచ్చిన టబు.. ఒకరిద్దరూ హీరోలతో సీరియస్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేసిందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను టబు కూడా పెద్ద ఖండించే ప్రయత్నం చేయలేదని కూడా తెలిసింది. సాధారణంగా హీరోహీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు రిలేషన్ షిప్స్ పెట్టుకోవడం, లవ్ ఎఫైర్స్, సీక్రెట్ డేటింగ్స్ వంటివి చేస్తూనే ఉంటారు.

కొందరు బహిరంగంగా చేస్తే మరికొందరు గుట్టుగా చేస్తుంటారు. ఇలాంటి కల్చర్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలకు పాకింది. తెలుగు,తమిళంలోనూ ఈ తరహా యవ్వారాలు నడిపించే వారు చాలా మందే ఉన్నారు. స్టార్ హీరో వారసులు కూడా ఇలాంటి రిలేషన్స్ మెయింటెన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇండస్ట్రీలో డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేయడానికి వయసుతో పెద్దగా పనిలేదని కొందరు అంటున్నారు. ఎందుకంటే తమ కూతురు వయసున్న హీరోయిన్లతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న హీరోలు ఉన్నారు. తమ కంటే ఎక్కువ వయసున్న హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోలూ ఉన్నారు.

Netizens Comments on Tabu

Netizens Comments on Tabu

Tabu : లేట్ రిలేషన్‌ షిప్‌కు టబు గ్రీన్ సిగ్నల్

ఇక పెళ్లయి విడాకులు తీసుకున్న సీనయర్ హీరోయిన్ తో ఓ కుర్రహీరో డేటింగ్ చేస్తున్నాడు. ఈ విషయం బాలీవుడ్‌లో కోడై కూస్తోంది. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ టబు కూడా ఇదే బాటలో నడవనున్నట్టు తెలుస్తోంది. ఓ సీనియర్ హీరోతో ఈ భామ రిలేషన్ పెట్టుకోవడానికి రెడీ అయ్యిందట.. మొన్నటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేసిన టబు.. యాబై ఏళ్ల వయసులో రిలేషన్ పెట్టుకోవడానికి సిద్ధపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగులో అక్కినేని నాగార్జున, హిందీలో అజయ్ దేవగన్ తో సీరియస్ రిలేషన్ పెట్టుకున్న టబు.. వారు పెళ్లికి నోచెప్పే సరికి పెళ్లిచేసుకోకుండా ఉండిపోయిందని టాక్. కానీ ఇప్పుడు టబు రిలేషన్ పెట్టుకోవడానికి రెడీ కావడంతో సర్వత్రా చర్చ జరగుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది