Nidhhi Agerwal : స్లీవ్‌లెస్ జాకెట్‌లో జ‌బ్బ‌లు చూపిస్తూ రెచ్చ‌గొడుతున్న నిధి అగ‌ర్వాల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nidhhi Agerwal : స్లీవ్‌లెస్ జాకెట్‌లో జ‌బ్బ‌లు చూపిస్తూ రెచ్చ‌గొడుతున్న నిధి అగ‌ర్వాల్

 Authored By sandeep | The Telugu News | Updated on :22 September 2022,12:30 pm

Nidhhi Agerwal : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చిన నిధి అగ‌ర్వాల్ ఇక త‌న‌దైన శైలిలో దూసుకుపోతుంది. మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నిధి అగ‌ర్వాల్ ఫ్యాషన్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. ఇక నిధి అలా ట్రై చేసిందో లేదో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైకల్ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ త‌ర్వాత తెలుగు సినిమా ఆఫర్స్ కోసం ప్ర‌య‌త్నించింది. అలా 2018లో నాగచైతన్యతో సవ్యసాచి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

స‌వ్య‌సాచి త‌ర్వాత మ‌ళ్లీ అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్‌తో న‌టించింది. మిస్టర్ మజ్ను అనే సినిమాచేయ‌గా,ఈ చిత్రం పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. ఇక నిధి కెరీర్ ముగిసిపోతుంది అని అనుకుంటున్న స‌మ‌యంలో ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం ఈ అమ్మ‌డికి బూస్ట‌ప్ ఇచ్చింది. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కలయికలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను అందుకోవడంతో ఒక్కసారిగా అమ్మడికి ఆఫర్లు క్యు కట్టాయి. కానీ అప్పుడు కూడా ఈ బ్యూటీ తొందరపడలేదు. ఆ తరువాత తమిళంలో రెండు డిఫరెంట్ సినిమాలు చేసింది. ప్రస్తుతం కూడా మంచి సినిమాలలో నటించే అవకాశం అయితే లభిస్తుంది.

Nidhhi Agerwal stunning looks

Nidhhi Agerwal stunning looks

Nidhhi Agerwal : ర‌చ్చ చేస్తుందిగా..

కేవలం సినిమాలతోనే కాకుండా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ అమ్మడు మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో వీలున్న‌ప్పుడ‌ల్లా త‌న అంద‌చందాల‌తో క‌వ్విస్తుంది. ఈ బ్యూటీ తాజ‌గా కేక పెట్టించే విధంగా స్ట‌న్ చేస్తుంది. ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇందులో నిధి అగ‌ర్వాల్ చీర‌క‌ట్టులో జ‌బ్బ‌లు చూపిస్తూ క‌వ్విస్తుంది. ఈ పిక్స్ చూసి నెటిజ‌న్స్ నోట మాట రాకుండా పోయింది.దిలా ఉంటే బ్యూటీ ఓ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు గా బాలీవుడ్ మీడియా లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు కే ఎల్ రాహుల్. వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది