Niharika : సంధ్య థియేటర్ ఘటన విషయంలో ఇరుక్కున్న అల్లు అర్జున్.. తొలిసారి స్పందించిన నిహారిక
ప్రధానాంశాలు:
Niharika : సంధ్య థియేటర్ ఘటన విషయంలో ఇరుక్కున్న అల్లు అర్జున్.. తొలిసారి స్పందించిన నిహారిక
Niharika : గత కొద్ది రోజులుగా సంధ్య థియేటర్ Niharika ఘటన సినీ వర్గాలలో ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రేవతి కుమారుడు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సినీనటి నిహారిక తొలిసారి స్పందించారు.దీనిపై మెగా డాటర్ నిహారిక కొణిదెల Niharika Konidela మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమంది. రేవతి మరణించడం తనను ఎంతో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత నిహారిక నటిస్తోన్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది.
Niharika నిహారిక సంచలన కామెంట్స్..
చెడు జరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. మనం బతకడానికే ఈ పని చేస్తుంటాం. రేవతి మరణ వార్త తెలియగానే నా మనసు ముక్కలైంది. ఇలాంటి ఘటనలు ఎవరూ ఊహించరు. అల్లు అర్జున్ allu arjun కూడా కూడా షాక్‌కి గురైయ్యారు. అందరి ప్రేమాభిమానంతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు’ అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. ‘లుక్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా సినిమాకు తన స్టైల్ మార్చుకుంటాడు. ఈ విషయంలో బన్నీనే నాకు స్ఫూర్తి అని నిహారిక తెలిపింది.
2016లో ఒక మనసు oka manasu అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ తర్వాత సూర్యకాంతం తదితర చిత్రాలలో నటించింది. కానీ ఏవి హీరోయిన్ గా ఈమెకు సక్సెస్ అందుకునేలా చేయలేదు. 2019లో యాక్టింగ్ కి దూరంగా ఉన్న నిహారిక పలు రకాల వెబ్ సిరీస్ లను నిర్మించింది. గత ఏడాది కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాతో నిర్మాతగా మారడం జరిగింది ఇది సక్సెస్ అయ్యింది. అయితే ఈ భామ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి ఇంట్లో వాళ్ల సూచనలు, సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలెక్షన్ లో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ Varun tej సలహాను తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్ గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తుంటాను అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.