Nithya Menen : నిత్యా మీనన్ ప్రేమయాణంలో ఇన్ని ట్విస్ట్‌లా?
Nithya Menen : మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిత్యామీనన్ కేవలం తన నటనతోనే ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. అద్భుతంగా హావభావాలు పలికించగల నటి అని ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇక నిత్యామీనన్ తన కెరీర్ లో ఎప్పుడూ గ్లామర్ రోల్స్ చేయలేదు. హద్దులు దాటి అందాల ఆరబోత చేయలేదు. ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోస్‌తో తెగ సందడి చేస్తుంది నిత్యా మీనన్. సొంతంగా యూట్యూబ్ చానల్ కూడా పెట్టుకుంది నిత్యామీనన్. నిత్య అన్‌ఫిల్టర్డ్ పేరుతో యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసి తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను వీడియోల రూపంలో తెలియజేస్తోంది.
అయితే నిత్యా మీనన్ పెళ్లికి, లవ్‌కి సంబంధించి ఇటీవల ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. కాని ఇప్పుడు మాత్రం సీక్రెట్ ఎఫైర్ నడుపుతుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం నిత్యా ప్రేమలో మునిగితేలుతోందని, త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతోందని సమాచారాలు వైరల్ అవుతున్నాయి.సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే నిత్యా మీనన్ పెళ్లి చేసుకోబోతోందనే టాక్ బయటకొచ్చింది. మలయాళంలో స్టార్ నటుడుగా కొనసాగుతున్న వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లోకి రాకముందు నుంచే అతనితో పరిచయం ఏర్పడి..

Nithya Menen love has so many twists
Nithya Menen : తక్కువది కాదు..
ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందని ఈ క్రమంలో కొన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలారని అంటున్నారు. ఇప్పుడు అతన్నే నిత్యా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని చెప్పుకుంటున్నారు. సో.. ఇందులో నిజానిజాల గురించి క్లారిటీ రావాలంటే నిత్యామీనన్ రియాక్ట్ కావాల్సిందే మరి. నిత్యా మీనన్ చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు నిత్యా మీనన్ తన హాట్ అందాలతో రెచ్చ గొడుతూ కేక పెట్టిస్తుంటుంది . ఈ అమ్మడి పిక్స్ పై ట్రోల్స్ కూడా నడుస్తుంటాయి.