Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ రష్మీని దారుణంగా అవమానించేశారు.. ఆ చానెల్‌లో షో చేయడంపై సెటైర్లు
Sudigali Sudheer : సుధీర్ రష్మీ ఎక్కడ కనిపించినా, ఏ షోలో సందడి చేసినా, ఏ ఈవెంట్‌లో మెరిసినా కూడా అది హిట్టే అవుతుంది.మామూలుగా అయితే రష్మీ సుధీర్ అంటే ఈటీవీ, మల్లెమాలలోనే కనిపిస్తారు. ఈ జోడి బయట చానెళ్లలో ఎక్కడా కూడా కనిపించదు. కానీ మొదటిసారిగా ఈ జోడి స్టార్ మా చానెల్లోకి వెళ్లింది. హోళీ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అందులో రష్మీ హోస్ట్‌గా పని చేసింది. సుధీర్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ షోకు సంబంధించిన ప్రోమో మామూలుగా హిట్టవ్వలేదు.
అయితే ఇందులో రష్మీ సుధీర్ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ మరోసారి అందరికీ అర్థమైంది. చివర్లోల సుధీర్ బుగ్గ మీద రష్మీ పెట్టిన దిష్టి చుక్క వైరల్ అయింది. అయితే ఇప్పుడు సుధీర్ పెళ్లి మీద నూకరాజు, పరదేశీ స్కిట్లు చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో సుధీర్ పెళ్లి అంటూ పదే పదే స్కిట్లు వేశారు. అందులో సుధీర్ రష్మీ, సుధీర్ విష్ణుప్రియ, సుధీర్ తేజస్వీ నాయుడు ఇలా అందరితో పెళ్లి ఈవెంట్లు జరిగినట్టుగా చూపించారు. అయితే చివరకు హోళీ ఈవెంట్ మీద కూడా సెటైర్లు వేశారు.

Nookarajau And Paradesi Satirical Skit On Sudigali Sudheer And Rashmi
Sudigali Sudheer : రెచ్చిపోయిన పరదేశీ, నూకరాజు
హోళీ ఈవెంట్ కోసం ఈ ఇద్దరూ స్టార్ మాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో దిష్టి చుక్క పెట్టడానికి ఇక్కడ సెటైరికల్‌గా స్కిట్ వేశారు. సుధీర్‌కు రష్మీ దిష్టి చుక్క పెట్టడంపై సెటైర్లు వేశారు. సుధీర్‌కు దిష్టి తగలకూడదన్నట్టుగా పెట్టాను అని రష్మీ కారెక్టర్ పోషించిన లేడీ ఆర్టిస్ట్ చెబుతుంది. ఇక నూకరాజు సెటైర్ వేసి సుధీర్ పరువుతీసేశాడు. కనిపించిన ప్రతీ అమ్మాయిని తగులుకోవచ్చు గానీ దిష్టి మాత్రం తగలకూడదా? అని కౌంటర్ వేస్తాడు. మొత్తానికి ఆ షోలో పాల్గొన్నందుకు ఇలా మొత్తానికి రివేంజ్ తీసుకున్నట్టున్నారు.
