Nora Fatehi : నేను ఆ పని 16 ఏళ్లకే మొదలు పెట్టా… ఐటెం గాళ్ నోరా ఫతేహి
Nora Fatehi : నోరా ఫతేహి అంటే సినిమా హీరోయిన్ మించి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో ఐటెం గాళ్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తన బెల్లీ డాన్స్‌తో సౌత్ అండ్ నార్త్ అభిమానులను కట్టి పడేసింది. స్టార్ హీరోలు సైతం నోరా ఫతేహి తమ సినిమాలలో స్పెషల్ సాంగ్ చేయాలంటు దర్శక, నిర్మాతలను ఆర్డర్ వేసేలా నోరా ఫేమస్ అయింది. తనలాంటి డాన్సర్ మళ్ళీ ఇప్పటి వరకు కనిపించలేదు. తెలుగులో పాన్ ఇండియన్ సినిమా బాహుబలి లో మనోహరి సాంగ్‌లో కనిపించిన ఈమె ఆ తర్వాత టెంపర్, ఊపిరి, లోఫర్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి క్రేజీ బ్యూటీగా మారింది.
ఇక బాలీవుడ్‌లో ఈమె నర్తించిన దిల్‌బర్ దిల్‌బర్ రీమిక్స్ సాంగ్ యూట్యూబ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఎత్తైన ఎద సంపదతో.. వావ్ అనిపించే బెల్లి డాన్స్‌తో మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో ఒక్కో సాంగ్‌కు తన క్రేజ్ స్టార్ హీరోయిన్ రెంజ్‌ను మించి పోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న కొన్ని డాన్స్ షోస్‌కు జడ్జ్ గానూ వ్యవహరిస్తోంది. అయితే నోరా ఇంతటి సక్సెస్ సాధించడానికి వెనక పెద్ద కథే ఉంది.
Nora Fatehi : నోరా ఫతేహి పురుషుల బట్టల దుకాణంలో, వెయిటర్ గా పని చేసింది.
కొందరి జీవితంలో ఉన్న విషాద ఛాయలు నోరా ఫతేహి లైఫ్‌లో కూడా ఉన్నాయట. టీనేజ్‌లో కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఒక ఆడపిల్లకి వస్తే ఎలా ఉంటుందో.. ఆ కష్టాన్ని నోరా అనుభవించిందట. 16 ఏళ్ళకే కుటుంబ బాధ్యతను భుజాన మోసిన ఈమె ఎన్నో కష్టాలు అవమానాలు పడి ఇంట్లో వాళ్లని పోషించిందట.
హైస్కూల్ చదువుతున్నప్పుడే ఒక మాల్‌లో పనిచేయాల్సి వచ్చిందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. రెస్టారెంట్లు.. బార్ లు, షావర్మా అమ్మే చోట వెయిటర్ గా పని చేసింది. అంతేకాదు పురుషుల బట్టల దుకాణంలోనూ, టెలిమార్కెటింగ్ కంపెనీ తో పాటు లాటరీ టికెట్లను అమ్మినట్టు నోరా ఫతేహి తెలిపింది. అలా కష్టాలు ఎదుర్కొన్న ఆమె ఈ రోజూ స్టార్ సెలబ్రిటీగా ఏలుతోంది.