Posani Krishna Murali : “టెంపర్” కి నంది అవార్డు రావడంపై పోసాని కృష్ణ మురళి కాంట్రవర్సీ కామెంట్స్ వీడియో వైరల్..!!
Posani Krishna Murali : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2015లో వచ్చిన సినిమా “టెంపర్”. వరుస పరాజయాలలో ఉన్న ఎన్టీఆర్ కి “టెంపర్” మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి మూర్తి అనే పాత్ర చేయడం జరిగింది. సినిమా మొత్తానికి పోసాని కృష్ణమురళి డైలాగులు పాత్ర చాలా హైలెట్. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ గా పోసాని పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నంది అవార్డ్స్ గురించి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తనకు అవార్డుల మీద నమ్మకం లేదని కానీ ఎవరికి ఇస్తున్నారు అన్నది అడగటం మరియు ప్రశ్నించడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. అందుకే అప్పట్లో నంది అవార్డుల ప్రధానం విషయంలో నిలదీయడం జరిగింది. కులాల ప్రాతిపదికన నంది అవార్డులు ఇస్తున్నారన్న అనుమానం నాకు కలిగింది. ఈ అవార్డుల కారణంగా చాలామంది నష్టపోయారని పోసాని వ్యాఖ్యానించారు. దీంతో తాను ప్రశ్నించడం తట్టుకోలేక అప్పట్లో “టెంపర్” సినిమాకి నంది పురస్కారం ఇవ్వటం జరిగిందని తెలియజేశారు.
అయితే ఇది నంది కాదు కమ్మ అవార్డుగా అనిపించిందని అందుకే తాను తిరస్కరించినట్లు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తీసుకున్న అవార్డు తిరిగి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నంది అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్తవారికి ఇవ్వాలా లేదా పాత వారికి ఇవ్వాలా అనే విషయాలపై ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీకి షూటింగ్ కి సంబంధించిన అనుమతులు కూడా సులువుగా ఉండే రీతిలో కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.
