NTR 30 : ఎన్.టి.ఆర్ 30 అప్‌డేట్ వచ్చేసింది.. డైరెక్టర్ అతనే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR 30 : ఎన్.టి.ఆర్ 30 అప్‌డేట్ వచ్చేసింది.. డైరెక్టర్ అతనే..!

 Authored By govind | The Telugu News | Updated on :12 April 2021,7:19 pm

NTR 30 : ఎన్.టి.ఆర్ 30 గురించి గత కొన్ని రోజులుగా రక రకాల వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఎన్.టి.ఆర్ 30 ఎప్పుడో కన్‌ఫర్మ్ అయిందని వార్తలు వచ్చాయి. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండిన్ సినిమానే మేకర్స్ ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి.

ntr 30 with koratala siva

ntr-30-with-koratala-siva

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ .. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. బాలీవుడ్ అండ్ హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొమురం భీం, అల్లూరి టీజర్స్.. అల్లూరి లుక్, సీత పాత్రలో నటిస్తున్న ఆలియా భట్ లుక్. అలాగే అజయ్ దేవగన్ లుక్ రీలీజై ఆర్ ఆర్ ఆర్ మీద భారీ అంచనాలు పెంచాయి. అక్టోబర్ 13న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

NTR 30 : ఆచార్య సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్.టి.ఆర్ 30 పట్టాలెక్కబోతోందట.

ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ 30 కి దర్శకుడు ఎవరని హాట్ హాట్ చర్చలు సాగాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ ప్రకటించారు. ఎన్.టి.ఆర్ 30 సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్.. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలలో నందమూరి కళ్యాణ్ రాం – సుధాకర్ మిక్కిలినేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ లతో చేస్తున్న ఆచార్య సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్.టి.ఆర్ 30 పట్టాలెక్కబోతోందట.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది