Nuvvu Nenu Prema 1 August Today Episode : భక్త ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో చచ్చిపోవాలని డిసైడ్ అయిన పద్మావతి.. తను సూసైడ్ చేసుకుంటుందా?
Nuvvu Nenu Prema 1 August Today Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 ఆగస్టు 2023, 377 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పద్మావతిని తీసుకొని భక్త ఇంటికి బయలుదేరుతాడు విక్కీ. తనను కారులో తీసుకెళ్తాడు. తనకు సీటు బెల్ట్ పెడతాడు విక్కీ. నువ్వు కావాలని చేస్తున్నావని నాకు అర్థం అయింది విక్కీ. నాకు టైమ్ వస్తుంది. అప్పుడు మళ్లీ చెప్తా అని మనసులో అనుకుంటాడు మురళి. పద్మావతి ఇప్పుడు సంతోషంగా ఉందంటే దానికి కారణం మీరే అంటుంది అరవింద. మీది మంచి మనసు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటుంది అరవింద. అంతా నా కర్మ. నేను అనుకున్నది నీకు వేరేలా అర్థం అవుతోంది అని మనసులో అనుకొని బాధపడతాడు మురళి. మరోవైపు కారులో విక్కీ, పద్దు ఇద్దరూ వెళ్తుంటారు. తనతో ఒక్క మాట కూడా మాట్లాడడు విక్కీ. ఒకప్పుడు ప్రేమను చూపించిన తనే.. ఇప్పుడు ద్వేషాన్ని చూపిస్తున్నాడు. అసలు ఈ మనిషికి ఏమైంది. నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు తను ఇలా చేస్తున్నాడు.. అని అనుకొని బాధపడుతుంది పద్దు.
సారూ.. అట్టా సైలెంట్ గా ఉండకపోతే ఏదైనా మాట్లాడొచ్చు కదా అంటుంది పద్దు. దీంతో కారు స్పీడ్ పెంచుతాడు. కోపంగా తనవైపు చూస్తాడు. వెంటనే కారు ఆపుతాడు. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే దింపేస్తాను అంటాడు విక్కీ. సర్లే ఊరికే ఉంటాను అంటుంది పద్దు. ఈ టెంపరోడు అంటే టెంపరోడే అని అనుకుంటుంది పద్దు. తన పాత మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది పద్దు. మధ్యలో సడెన్ గా కారు ఆపుతాడు. ఇక్కడెందుకు ఆపారు అని అడుగుతుంది పద్మావతి. దీంతో నీ ఇల్లు వచ్చింది అంటాడు విక్కీ. దీంతో ఆయ్.. నా ఇల్లు వచ్చేసి ఉండాది అంటూ దిగుతుంది. మీరు దిగరా అంటే నాకు పని ఉంది.. అంటాడు విక్కీ. మీరు కూడా రండి అంటే.. నాకు పని ఉంది అని చెప్పానా అంటాడు విక్కీ. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Nuvvu Nenu Prema 1 August Today Episode : పద్దును తన ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయిన విక్కీ
దీంతో తనకు కోపం వస్తుంది. కానీ.. తన ఇంటికి వచ్చిన సంబురంలో విక్కీ గురించి మరిచిపోయి తన ఇంట్లో అడుగుపెట్టబోతుంది. తన ఇంట్లో అడుగు పెడుతూ తన పాత మెమోరీస్ ను గుర్తు చేసుకుంటుంది. బాధపడకు అను అంటూ లక్ష్మీ అనును ఓదార్చుతూ ఉంటుంది. ఇంతలో పద్మావతిని చూస్తారు. పిన్ని అంటూ లోపలికి వస్తుంది పద్దు. ఇంతలో ఆగు అంటూ తన అత్త వస్తుంది. భక్త కూడా వస్తాడు. నువ్వు చేసిన పనికి నీ మొహం కూడా చూడబుద్ధి కావట్లేదు అని అంటుంది ఆండాలు. పోవే అంటే అత్త ఇది నా ఇల్లు. ఇక్కడ మా అమ్మానన్న ఉన్నారు. వాళ్లను చూడటానికి వస్తే నువ్వేనంది పో అంటున్నావు అంటుంది పద్మావతి.
దీంతో నీకు, మాకు ఎప్పుడో తెగదెంపులు అయ్యాయి. నీకు, మాకు ఎలాంటి సంబంధం లేదు. పో ఇక్కడి నుంచి అంటుంది ఆండాలు. నీకు కోపం వస్తే నన్ను కొట్టు, తిట్టు.. అంతే కానీ.. ఈ ఇంటితో సంబంధం లేదంటున్నావు ఏంది. మీరంతా నా ప్రాణం. నేను సచ్చేదాకా మీతో నా బంధం ఇట్నే ఉంటాది తెలుసునా అంటుంది పద్మావతి. నాయినా.. నువ్వు కూడా ఏంది నాయనా. నేను రావడం కాస్త లేట్ అయినాది అంతే. దానికే నన్ను ఇడిసిపెట్టి రావాల్నా అంటుంది పద్మావతి. మా నాయినకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంటుంది అని చెప్పిన అంటుంది పద్మావతి. కదా నాయినా.. కదా అంటుంది పద్మావతి.
దీంతో నీ కన్నవాళ్లు ఎవరో తెలియకపోయినా నిన్ను మా కన్నబిడ్డలా పెంచాం. మా ప్రాణం కంటే ఎక్కువగా పెంచుండాం. కానీ నువ్వేం చేశావు. చెప్పకుండా పెళ్లి చేసుకొని మా పరువును బజారుకీడ్చుండావు. సిగ్గుతో తలదించుకునేలా చేశావు. ఇప్పుడు మాకు బాధలు కన్నీళ్లు తప్ప ఏం లేవు అంటాడు భక్త. నిన్ను కూతురుగా కాదు. కొడుకుగా పెంచాం. నువ్వు ఏం చేసినా నిన్ను సమర్థించాం. కానీ.. నువ్వు ఆ నమ్మకాన్ని వమ్ము చేసి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు.
నువ్వు చేసిన ఈ పని వల్ల అందరూ ఆస్తి కోసమే ఈ పని చేశావని మాపై నిందలు వేశారు. నిన్ను ఎలా నమ్మమంటావు అని అంటాడు భక్త. దీంతో నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలియదు అంటుంది పద్దు. దీంతో అదేంటో ఇప్పుడే చెప్పు అంటాడు భక్త. మాకు చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు భక్త.
కానీ.. అను పెళ్లి కోసమే ఈ పెళ్లి చేసుకున్నా అనే అసలు నిజం చెప్పలేకపోతుంది పద్మావతి. నువ్వేం చెప్పకపోతే నీ కన్నవాళ్లపై పడ్డ నింద అలాగే ఉండిపోతుంది అంటుంది లక్ష్మీ. నేను చెప్పలేను నాయినా. చెప్తే మీరు విని తట్టుకోలేరు అని అనుకుంటుంది. మీరంతా సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని అనుకుంటుంది.
ఇంట్లో వాళ్లు ఎంత అడిగినా కూడా సమాధానం చెప్పదు పద్మావతి. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. పరిస్థితులు మీ ముందు నన్ను దోషిగా నిలిపాయి. నాన్నా నేను మీ కూతురును. ప్రాణం పోయినా తప్పు చేయను. అలాంటిది మీపై నేను నిందను ఎలా పడనిస్తాను నాయనా అంటుంది పద్మావతి. ఇక చాలు. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా మా బాధను కొంతైనా తీర్చుతావని అనుకున్నాను. కానీ.. నా తప్పేం లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నావు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది. అందరూ నోటికొచ్చినట్టు అంటున్నారు అంటాడు భక్త.
నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను అంటుంది పద్మావతి. అయినా కూడా వినకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అంటాడు భక్త. తప్పు చేసిన వాళ్లు నా ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను అంటాడు భక్త. నేను ఏ తప్పూ చేయలేదు నాయినా అంటుంది పద్దు. కానీ.. తనతో మాటలు వద్దు ఇంట్లో నుంచి పంపించేసెయ్ అని ఆండాలుతో అంటాడు భక్త.
ఇది నువ్వే కోరి తెచ్చుకున్నావు. మేము ఎవ్వరం నీకు అవసరం లేకుండొచ్చు. కానీ.. నా తమ్ముడి ఆరోగ్యమే నాకు ముఖ్యం.. అంటుంది ఆండాలు. నీ డ్రామాలు ఆపి పోవే బయటికి అంటుంది పద్దు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఇక్కడే ఉంటా అంటుంది పద్దు. దాన్ని ఉండమను అత్త అని అను చెప్పినా వినదు ఆండాలు. దీంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చి చచ్చిపోవాలని నిర్ణయించుకుంటుంది పద్దు. ఓ పెద్ద కొండ మీదికి చేరుకుంటుంది పద్దు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.