Sarkaru Vaari Paata : సర్కారు వారి పాటతో పూరి జగన్నాథ్‌ను మించిపోయాడా..అదెలాగబ్బా…?
Sarkaru Vaari Paata : సర్కారు వారి పాటతో దర్శకుడు పరశురామ్ పెట్లా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను మించిపోయాడని చెప్పుకుంటున్నారు. దాంతో నెటిజన్స్ అదెలాగబ్బా…? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా ముందు వరకు పరశురామ్ డైరెక్ట్ చేసిన పెద్ద హీరో అంటే అది మాస్ మహారాజ రవితేజ మాత్రమే. హ్యాపీడేస్ సినిమా తర్వాత నిఖిల్ సిద్దార్థ్‌తో యువత సినిమాను తీశాడు పరశురామ్. పూరి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన పరశురామ్.. ఆయనకు బంధువు కూడా.యువత సినిమాతో దర్శకుడిగా మారిన పరశురామ్ ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలను తెరకెక్కించాడు.
వీటిలో గీత గోవిందం భారీ హిట్ సాధించి పరశురామ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా హిట్ వల్లే మహేశ్ దృష్ఠిలో పడి సర్కారు వారి పాట సినిమా తీసే అవకాశం అందుకున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించాయి. ఒక పక్క డైవైడ్ టాక్ వచ్చినా భారీ సాధించామని మేకర్స్ చెప్పుకుంటున్నారు.ఇదిలా ఉంటే మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంటి ఓ పెద్ద హీరోను డైరెక్ట్ చేసిన పరశురామ్ ..యాక్షన్ సీన్స్, రొమాంటిక్స్ సీన్స్‌లలో మహేశ్‌ను అద్భుతంగా చూపించాడు.

Parasuram Sarkaru Vaari Paata surpassed Puri Jagannath
Sarkaru Vaari Paata : ఆయన రేంజ్‌కు ఇప్పుడే చేరుకోవడం కష్టం..!
అక్కడక్కడా పూరి మేకింగ్ స్టైల్ కూడా కనిపించింది. ముఖ్యంగా ఫైట్స్ విషయంలో పూరిని ఫాలో అయ్యాడనిఅంటున్నారు. అంతేకాదు, పూరి మహేశ్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమా తరహాలోనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సర్కారు వారి పాట సినిమాను పరశురామ్ రూపొందించాడని..ఈ సినిమాతో ఆయన రేంజ్‌కు చేరుకున్నాడని చెప్పుకుంటున్నారు. కానీ, నెటిజన్స్ మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు.
పూరి కెరీర్ ప్రారంభం నుంచి అందరు పెద్ద హీరోలతో సినిమాలు తీసి భారీ హిట్స్ అందుకున్నారు. అంతేకాదు, ఓ దర్శకుడిగా పూరి సంపాదించిన క్రెడిబులిటీ, మనిబులిటీ పరశురామ్ సాధించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టే ఆయన రేంజ్‌కు ఇప్పుడే చేరుకోవడం కష్టం అంటున్నారు.