Bheemla Nayak : భీమ్లా నాయక్ అంటూ పవర్ స్టార్ రచ్చ.. అదిరిపోయిన గ్లింప్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bheemla Nayak : భీమ్లా నాయక్ అంటూ పవర్ స్టార్ రచ్చ.. అదిరిపోయిన గ్లింప్స్

 Authored By bkalyan | The Telugu News | Updated on :15 August 2021,10:05 am

Bheemla Nayak పవన్ కళ్యాణ్ Pawan kalyan భీమ్లా నాయక్ Bheemla Nayak పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ అంటూ పిలిచిన ఈ మూవీ టైటిల్‌ను నేడు ప్రకటించారు. దీంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ పేరిట అదిరిపోయే వీడియోను షేర్ చేశారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వదిలిన ఈ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ రానా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టబోతోన్నట్టు కనిపిస్తోంది.

Pawan kalyan Bheemla Nayak Movie First Glimpse

Pawan kalyan Bheemla Nayak Movie First Glimpse

భీమ్లా నాయక్ అంటూ పవర్ స్టార్ రచ్చ.. అదిరిపోయిన గ్లింప్స్ Bheemla Nayak

ఇక తాజాగా వదిలిన టైటిల్ అండ్ గ్లింప్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్ కళ్యాణ్ రెచ్చిపోయాడు. కుర్రాడిలా ఇరగదీశాడు. రేయ్ గని బయటకు రారా నా కొడకా అంటూ దుమ్ములేపేశాడు. భీమ్లా నాయక్ అంటూ టైటిల్‌తో అదరగొట్టేశాడు. కింద క్యాప్షన్ లేదని చూస్తున్నావా? ఏం అక్కర్లేదు బండెక్కు అని పవన్ కళ్యాణ్ కొట్టిన డైలాగ్‌లు అదిరిపోయాయి. మొత్తానికి పవర్ స్టార్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలానే ఫస్ట్ గ్లింప్స్ ఉంది.

Pawan kalyan Bheemla Nayak Movie First Glimpse

Pawan kalyan Bheemla Nayak Movie First Glimpse

ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇక మళయాలి రీమేక్ అయిన ఈ మూవీపై త్రివిక్రమ్ కసరత్తు చేశాడు. తగినన్ని మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ అందించాడు. సాగర్ చంద్ర ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ మీద నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక తమన్ ఇప్పటికే అదిరిపోయే పాటలను రెడీ చేసినట్టు తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటాయి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోన్న సంగతి తెలిసిందే.

YouTube video

ఇది కూడా చ‌ద‌వండి ==> బిగ్‌బాస్‌లోకి పాపులర్ డ్యాన్స్ మాస్టర్ కపుల్ ఎంట్రీ..పోల్ పెట్టిమరీ లీక్ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> తమన్నాకి అదంటే బాగా ఇష్టమట..నెలకి ఎన్నిసార్లు వెళుతుందో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆహా ఏమీ అందం చీరకట్టిన చందమామ !!.. యాంకర్ విష్ణుప్రియ పిక్స్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> హైపర్ ఆదికి అవమానం.. స్టేజ్ మీదే బట్టలు చించేశారు !

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది