Pawan Kalyan : చిరంజీవి కొడుకు అయినా, తమ్ముడైనా, సత్తా లేకపోతే నిలబడలేం.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
Pawan Kalyan : చిరంజీవి కొడుకు అయినా, తమ్ముడైనా, సత్తా లేకపోతే నిలబడలేం.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
Pawan Kalyan : సినీ ఇండస్ట్రీలో Hari Hara Veera Mallu ఓ నటుడిగా స్థిరపడాలంటే వ్యక్తిగత ప్రతిభే ప్రధానంగా ఉండాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, సినిమా రంగంలో ఎన్నెన్నో సవాళ్లు ఉన్నా… అవన్నీ దాటి నిలదొక్కుకోవాలంటే సత్తా ఉండాలి అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.

Pawan Kalyan : చిరంజీవి కొడుకు అయినా, తమ్ముడైనా, సత్తా లేకపోతే నిలబడలేం.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
Pawan Kalyan నా కొడుకైన సరే..
‘‘చిరంజీవి కొడుకు అయినా, తమ్ముడైనా… మనకు టాలెంట్ లేకపోతే ఒక్క రోజు కూడా నిలబడలేం. చివరకు నా కొడుకైన సరే.. సినిమా ఇండస్ట్రీ అసలు ఎవరినీ ఉపేక్షించదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి పరీక్షే. ఎవరి నేపథ్యం ఎంత శక్తివంతమైనదైనా, స్క్రీన్‌పై ప్రదర్శనే తుది తీర్పు ఇస్తుంది అని పవన్ చెప్పారు.
ఇక సమాజంలో కనిపించే వివక్షలు, భేదాలు సినిమాల్లో చోటు చేసుకోవని ఆయన స్పష్టం చేశారు. ‘‘మనం బయట కులం, మతం, ప్రాంతం పేరుతో వేరుపడతాం. కానీ సినిమా మాత్రం ఆ పరిధులను దాటిపోయింది. ఇది కళ, ఇది భావోద్వేగం. ఇక్కడ అటువంటి వివక్షలకు చోటుండదు’’ అని పవన్ అభిప్రాయపడ్డారు.సినిమా రంగం అంటే గ్లామర్ అనుకుంటారు కానీ, వెనుక ఎంతో కష్టంతో కూడిన ప్రయాణం ఉంటుంది. ప్రేక్షకులు అంగీకరించాలంటే నిజమైన ప్రతిభ ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ అన్నారు.