Pawan Kalyan : మనల్ని ఎవడ్రా ఆపేది? పవన్ కళ్యాణ్ డైలాగ్ రిపీట్…!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : మనల్ని ఎవడ్రా ఆపేది? పవన్ కళ్యాణ్ డైలాగ్ రిపీట్...!
Pawan Kalyan : హరిహర వీరమల్లు మూవీ రివ్యూ hari hara veera mallu Review ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “తెలంగాణలో సభకి పర్మిషన్ ఇచ్చిన సీఎంకి ధన్యవాదాలు. పాలిటిక్స్ లో మంచి స్నేహితుడిని సంపాదించుకున్నా… ఆయనే ఈశ్వర్” అన్నారు. అలాగే మనల్నెవడ్రా ఆపేది.. అన్న మాటకు అర్థం చెప్పారు పవన్.

Pawan Kalyan : మనల్ని ఎవడ్రా ఆపేది? పవన్ కళ్యాణ్ డైలాగ్ రిపీట్…!
Pawan Kalyan డబ్బుల కోసమే..
ఎప్పుడూ రికార్డుల కోసం ఆశించలేదు, యాక్టర్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచనే నాది. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు. ఆయుధాలు.. గూండాలు నాదగ్గర లేవు. వయసు పెరిగింది కానీ, గుండెల్లో చావ ఇంకా చావలేదు అన్నారు పవన్. డబ్బుకి ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు.. బంధాలకే ప్రాముఖ్యతనిచ్చాను నా గుండె నుంచి మీ గుండెకి.. రెండు గుండెల దూరం అంతే.
చాలా కష్టాల్లో హరిహరవీరమల్లు చేశా.. పేరున్నా, ప్రధానమంత్రి తెలిసినా డబ్బులు రావు. సినిమాతో అభిమానులను రంజింపజేయాలని చేశా. నేను కింద నుంచి వచ్చినవాడిని.. పెద్ద పెద్ద దర్శకులు లేరు. రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయని అందరూ అనుకున్నారు. నేను చేసిన పాపమల్లా ఒక ఫ్లాప్ ఇవ్వడం. దాని తర్వాత ఇండస్ట్రీ లో గ్రిప్ రాలేదు. ఆ టైమ్‌లో నన్ను వెతుక్కుంటూ వచ్చింది త్రివిక్రమ్. నాకు దేశం పిచ్చి.. సమాజ బాధ్యత పిచ్చి,.. నేనంటే ఫ్యాన్స్ కి పిచ్చి. ఈ సినిమాకు అంత ఆత్మవిశ్వాసంతో ఉండటానికి కారణం కీరవాణి. హరిహరవీరమల్లు బలానికి కారణం కీరవాణి అని పవన్ అన్నారు.
మనల్ని ఎవడ్రా ఆపేది?
పవన్ డైలాగ్ రిపీట్#HariHaraVeeraMallu #PawanKalyan pic.twitter.com/GZiNJqunJy
— Telugu360 (@Telugu360) July 21, 2025