Pawan Kalyan : మంచు విష్ణుకు పవన్ కల్యాణ్ షాక్..!
Pawan Kalyan : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా హీరో మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన్ను, జనసేనాని పవన్ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమానికి ఆహ్వానించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు హాజరయ్యారు.‘అలాయ్ బలాయ్’ కార్యక్రమంలో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్క పక్కనే కూర్చొన్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర సంఘటన జరిగింది.
మా ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు, పక్కనే కూర్చొన పవన్ కల్యాణ్‌ను పలకరించే ప్రయత్నం చేశారు. అయితే, పవన్ మాత్రం స్పందించడానికి ఆసక్తి చూపలేదు. తన పని తాను చేసుకుంటున్నట్లుగా పవన్ కల్యాణ్ అలానే ఉండిపోయారు. ఏటా దత్తన్న ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించే సంగతి అందరికీ తెలిసిందే. కాగా, కార్యక్రమంలో ఆహ్వానితులందరినీ సన్మానించడం విశేషం. పవన్ కల్యాణ్, విష్ణును భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సన్మానించారు. ఈ సంగతులు పక్కనబెడితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి మా ఎలక్షన్స్ సందర్భంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ను సపోర్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి.
Pawan Kalyan : సైలెంట్ షాక్ ఇచ్చిన జనసేనాని..!
మెగా బ్రదర్ నాగబాబు అయితే అఫీషియల్‌గానే ప్రకాశ్ రాజ్‌కు మద్దుతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణుకు పవన్ కల్యాణ్ సైలెంట్ షాక్ ఇచ్చారని పవన్ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తన మౌనంతో సమాధానం చెప్పారని అనుకుంటున్నారు. మంచు అహంకారంపై మౌనంగా పవన్ దెబ్బ కొట్టారని అంటున్నారు. అయితే, విభేదాలు ఉన్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ఐక్యత ప్రదర్శించాలని, అలా చేస్తే బాగుండేదని పవన్ వైఖరిపై కొందరు ఆరోపణలు కూడా చేస్తున్నారు. మా ప్రెసిడెంట్, కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికిగాను అందరికీ ఆహ్వానాలు పంపుతామని విష్ణు తెలిపారు.
ఈ క్రమంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు నందమూరి నటసింహం బాలయ్య ఇంటికి వెళ్లి ఆహ్వానం ఇచ్చారు. పరుచూరి బ్రదర్స్, కోట శ్రీనివాసరావు తదితరులను కలిసినట్లు విష్ణు చెప్పారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి ఆహ్వానం ఇస్తామని చెప్పారు. అయితే, చిరంజీవికి ఆహ్వానం అందిందా లేదా అనే విషయమై క్లారిటీ అయితే ఇంకా రాలేదు.