Pongal Movies Collections : సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పరిస్థితి ఏంటి.. ఏ సినిమాకి ఎక్కువ లాభాలు ?
ప్రధానాంశాలు:
Pongal Movies Collections : సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పరిస్థితి ఏంటి.. ఏ సినిమాకి ఎక్కువ లాభాలు ?
Pongal Movies Collections : ఈ సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ Game Changer , డాకు మహరాజ్daku maharaj , సంక్రాంతికి వస్తున్నాం sankranthiki vasthunam చిత్రాలు విడుదల కాగా, ఈ చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదం పంచాయి. జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. ఈ సినిమాకు Telugu States తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ అడియన్స్ జై కొడుతున్నారు. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు రెండు రోజుల్లోనూ మరిన్ని కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
Pongal Movies Collections వసూళ్ల వర్షం..
బాక్సాఫీస్ వద్ద విక్టరీ Venkatesh రాంపేజ్ కొనసాగుతున్నట్లు పేర్కొంది. కానీ మొదటి రోజు ఈ సినిమా రూ. 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. వెంకీ కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమగా ఈ మూవీ నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక గేమ్ ఛేంజర్ daku maharaj పై మూవీ మేకర్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ, బాలయ్య Balakrishna డాకుమహారాజ్ కు మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్సాన్స్ వస్తుండటం. Venkatesh విక్టరీ వెంకటేష్ ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పాజిటివ్ సొంతం చేసుకోవడంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పై ఎక్కువ ఎఫెక్ట్ పడింది. గేమ్ ఛేంజర్ daku maharaj ఐదు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.106.34 కోట్లకు చేరుకుంది.
ఇక డాకు మహారాజ్daku maharaj కు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ అందుకుంది. సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్న ‘డాకు మహరాజ్’ daku maharaj ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్లు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన బాలయ్య మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్షన్స్ అందుకోవడం విశేషం. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు కలెక్షన్స్ రూ.12.50 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు. నాలుగు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ మొత్తం రూ. 59.40 కోట్లు వసుళ్లు చేసింది. ఇక వర్డల్ వైడ్ గా డాగు మహారాజ్ రూ.95 కోట్ల చేసినట్టు తెలుస్తోంది. ఈ జోరు కొనసాగితే.. రూ. 100 కోట్ల మార్క్ సులువుగా క్రాస్ అయ్యేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.