Bulli Raju : బిజీ యాక్టర్‌గా బుల్లిరాజు.. ఒక్క సినిమాకు అంత రెమ్యునరేషనా..?
ప్రధానాంశాలు:
Bulli Raju : బిజీ యాక్టర్‌గా బుల్లిరాజు.. ఒక్క సినిమాకు అంత రెమ్యునరేషనా..?
Bulli Raju : సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ Bulli Raju Sankranthiki vasthunnam చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న బుల్లిరాజు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయాడు. సినిమాలో విక్టరీ వెంకటేశ్ Venkatesh తో కలసి చెప్పిన ‘నేను కొరికేస్తాన్.. నేను కొరికేస్తాన్’ అనే డైలాగ్ విపరీతంగా పాపులర్ అయింది. తన నటన, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో బుల్లిరాజు అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

Bulli Raju : బిజీ యాక్టర్‌గా బుల్లిరాజు.. ఒక్క సినిమాకు అంత రెమ్యునరేషనా..?
Bulli Raju : ఇంత రెమ్యునరేషనా..
విక్టరీ వెంకటేశ్‌ను తండ్రిగా చూపించిన ఈ చిత్రంలో బుల్లిరాజు పాత్ర ప్రేక్షకులను ఎమోషనల్ చేసేసింది. తండ్రిని ఎవరైనా తిడితే భరించలేని కుమారుడిగా, తండ్రి పట్ల అపారమైన ప్రేమను వ్యక్తీకరించే కొడుకుగా బుల్లిరాజు ఇచ్చిన నాటకీయమైన ప్రదర్శన ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే ఫేమ్ బుల్లిరాజుకు భారీ డిమాండ్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం చిరంజీవి సినిమాలో కూడా ఆఫర్ దక్కించుకున్నట్టు సమాచారం. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, బుల్లిరాజు తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసాడట. ఒక్క మూవీ కోసం ఏకంగా కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది చైల్డ్ ఆర్టిస్టుల మధ్య అత్యధిక రెమ్యూనరేషన్‌లలో ఒకటిగా చెబుతున్నారు. సాధారణంగా చిన్నారుల పాత్రలకు ఇంత పారితోషికం ఉండదు. కానీ బుల్లిరాజు టాలెంట్ చూసిన తర్వాత నిర్మాతలు కూడా ఆఫర్‌లు ఇచ్చేందుకు వెనుకాడడం లేదని టాక్ వినిపిస్తుంది.