Pooja Hegde : జిమ్ లో కుర్రాడితో పోటాపోటీగా చేస్తున్నా హీరోయిన్ పూజా హెగ్డే.. వీడియో..!!
Pooja Hegde : హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో చాలామంది దర్శకులకు మరియు నిర్మాతలకు లక్కీ హీరోయిన్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూడో సినిమా SSMB 28 చేస్తుంది. ఈ సినిమాతో పాటు పలు సినిమాలు నటిస్తూ ఉంది. కొద్ది నెలల క్రితం సల్మాన్ ఖాన్ తో చేస్తున్న సినిమా షూటింగ్ లో పూజ హెగ్డే గాయపడటం తెలిసిందే. యాక్షన్స్ సన్నివేశాలకీ సంబంధించి చిత్రీకరణ చేస్తున్న సమయంలో కాల్ ఫ్రాక్చర్ కావడంతో దాదాపు నెల రోజులకు
పైగానే పూజ హెగ్డే బెడ్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇటీవల కోలుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి తాజాగా జిమ్ లో కుర్రాడితో పోటా పోటీగా ఎక్సర్సైజులు చేస్తూ ఉంది. స్క్వాట్స్… చెస్ట్ ఎక్సర్సైజ్..లు చేసింది. గతంలో మాదిరిగా చాలా చలాకీగా.. కనిపిస్తోంది. కాలికైన ఫ్రాక్చర్ పూర్తిగా నయమైనట్లు… పూజా హెగ్డే చేస్తున్న ఎక్సర్సైజులు బట్టి తెలుస్తోంది. ఈ వీడియోలో పూజా హెగ్డే లుక్ యమహాట్ గా ఉంది.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో పాటు హరీష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” లో చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే మహేష్ బాబు షూటింగ్ లో పూజా హెగ్డే జాయిన్ కావడం జరిగింది. ఈ షెడ్యూల్ దాదాపు 60 రోజులపాటు జరగనున్నట్లు సమాచారం. సౌత్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు మెండుగా అందుకుంటున్న సమయంలో కాలికి ఫ్రాక్చర్ కావడంతో పూజా హెగ్డే స్పీడ్ కొద్దిగా తగ్గింది.