Posani Krishna Murali : ఏపీ రాజకీయాల్లో నంది అవార్డ్స్ గొడవలపై పోసాని కృష్ణ మురళి వైరల్ కామెంట్స్..!!
Posani Krishna Murali : విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ నాయకులు భారీ ఎత్తున కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 31వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా… ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “మోసగాళ్లకు మోసగాళ్లకు” సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైజయంతి మూవీస్ నిర్మాత అశ్విని దత్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో… నంది అవార్డుల ప్రధానోత్సవం పై అశ్విని దత్ వైరల్ కామెంట్లు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని ఉద్దేశించి…”ఇప్పుడు నడుస్తున్న సీజన్ వేరు కదా! ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ… వాళ్ళకు ఇస్తారు. సినిమాకు ఇచ్చే రోజులు మరో రెండు, మూడు ఏళ్లలో వస్తాయి” అని అన్నారు. పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి సినిమాలకు నంది అవార్డులు వస్తాయి అన్నట్టు మాట్లాడారు. దీనికి ఏపీ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. “అశ్వనీదత్ అన్న పొరపాటున ఒక్క మాట మర్చిపోయాడు… గతంలో ఒకసారి నాతో ఆయన ఏమన్నారంటే?
ఉత్తమ వెన్నుపోటు దారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ డాఫర్ వంటి అవార్డులు ఇవ్వాలని చెప్పారు. అసలు, జగన్ ప్రభుత్వం అవార్డులు ఇస్తే కదా! ఒకవేళ ఆయన నంది అవార్డులు ఇస్తే… జగన్ మనుషులకు అవార్డులు ఇచ్చుకున్నారని చెప్పవచ్చు. తప్పు లేదు. కానీ, మాటలు ఇంకో రకంగా చెప్పారు. అంతకు ముందు పైన చెప్పిన అవార్డులు ఇచ్చారు. ఉత్తమ గురికాడు… నారా చంద్రబాబు నాయుడు మనిషి చెప్పు తీసుకుని గురి చూసి ఎన్టీ రామారావును కొట్టాడు కదా, అతనికి అవార్డులు ఇచ్చారు… అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.