Prabhas25 : ‘ ప్రభాస్ 25 ‘ కొరటాల శివ – మైత్రీ మూవీమేకర్స్ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas25 : ‘ ప్రభాస్ 25 ‘ కొరటాల శివ – మైత్రీ మూవీమేకర్స్ ..?

 Authored By govind | The Telugu News | Updated on :19 February 2021,4:30 pm

Prabhas25 : ప్రభాస్ ప్రస్తుతం వరసగా అన్నీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ అన్న పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కృష్ణం రాజు – భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై 250 కోట్ల భారీ భడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. జూలై 30 న రాధే శ్యామ్ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్ కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. కాగా రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్ లో 20 గా రానుంది.

prabhas 25 koratala siva mytri movie makers

prabhas-25 koratala siva mytri movie makers

ఇక ఈ సినిమా తర్వాత భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సలార్ తెరకెక్కబోతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. హోంబలే నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. రాముడిగా కనిపించబోతున్న ఈ సినిమా సైఫ్ అలీఖాన్ లంకేష్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11 న రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. అలాగే వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నాడు.

Prabhas25 : ప్రభాస్ 25 ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

ఇలా వరసగా సినిమాలు కమిటయ్యాడు. ఈ సినిమాల ఆర్డర్ ఎలా ఉన్నా ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో 23 వ సినిమా వరకు కమిటయి ఉన్నాడు. ఇక ప్రభాస్ 24, ప్రభాస్ 25 కి దర్శకులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రభాస్ 25 ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో రూపొందనుందని సమాచారం. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తునాడని సమాచారం. ప్రభాస్ తో మిర్చి సినిమా తీసి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు కొరటాల శివ. మిర్చి నుంచి ఇప్పటి వరకు అన్నీ బ్లాక్ బస్టర్స్ తీస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఆచార్య చేస్తున్న కొరటాల నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు. మరి ప్రభాస్ 25 ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది