Adipurush : ఆదిపురుష్ సినిమా హిట్టా ఫట్టా ఈ ఒక్క దెబ్బతో తేలిపోతుంది !
Adipurush: సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? అనేది చెప్పాలంటే కొన్ని సినిమాల టీజర్లు, ట్రైలర్లు చూస్తే చాలు. ఆ సినిమాల ఫేట్ వెంటనే తెలిసిపోతుంది. టీజర్లు, ట్రైలర్లతోనే కొన్ని సినిమాలకు కలిసి వస్తుంది. సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకున్నా.. టీజర్, ట్రైలర్ వల్ల ప్లస్ అవుతుంటుంది. టీజర్స్, ట్రైలర్స్ మంచి టాక్ తెచ్చుకుంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయితే ఇక సినిమాకు విడుదలయ్యే వరకు పాజిటివ్ టాక్ ఉంటుంది. భారీ అంచనాలతో సినిమా […]
Adipurush: సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? అనేది చెప్పాలంటే కొన్ని సినిమాల టీజర్లు, ట్రైలర్లు చూస్తే చాలు. ఆ సినిమాల ఫేట్ వెంటనే తెలిసిపోతుంది. టీజర్లు, ట్రైలర్లతోనే కొన్ని సినిమాలకు కలిసి వస్తుంది. సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకున్నా.. టీజర్, ట్రైలర్ వల్ల ప్లస్ అవుతుంటుంది. టీజర్స్, ట్రైలర్స్ మంచి టాక్ తెచ్చుకుంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయితే ఇక సినిమాకు విడుదలయ్యే వరకు పాజిటివ్ టాక్ ఉంటుంది. భారీ అంచనాలతో సినిమా విడుదలవుతుంది. టీజర్, ట్రైలర్ సరిగ్గా లేకపోతే హైప్ తగ్గుతుంది.
దానికి ఉదాహరణ ఆదిపురుష్ సినిమా టీజర్. అవును.. ఈ సినిమా టీజర్ గత సంవత్సరం విడుదలైన విషయం తెలిసిందే. టీజర్ విడుదలకు ముందు సినిమాకు మంచి హైప్ వచ్చింది. కానీ.. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఇక చూసుకోండి.. ఒక్కసారిగా సినిమా మీద ఉన్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. నిజానికి.. అది రామాయణ ఇతిహాసం మీద వస్తున్న సినిమా. ఇందులో మనం అనుకున్నట్టుగా పాత్రలు ఉండవు. పూర్తిగా గ్రాఫిక్స్ తో కూడిన పాత్రలు ఉంటాయి. అదే.. సినిమాకు మైనస్ అయింది. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు టెక్నాలజీనే మైనస్ పాయింట్ అయింది అని చెప్పుకోవాలి. నిజానికి ఏ సినిమాకు అయినా టెక్నాలజీ బలం కావాలి. కానీ.. ఈ సినిమాకు టెక్నాలజీ మైనస్ పాయింట్ అయింది.
Adipurush: టెక్నాలజీనే ఈ సినిమాకు బలహీనతగా మారిందా?
టీజర్ అనుకున్న విధంగా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో పాటు ట్రోల్స్ రావడంతో సినిమా విడుదలనే వాయిదా వేసుకుంది మూవీ యూనిట్. మళ్లీ సినిమాలో సమూల మార్పులు చేసింది. వచ్చే జూన్ 16న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది. సినిమా ట్రైలర్ విడుదలయ్యాక.. అప్పుడు మూవీ మీద ఎలాంటి ఒపినియన్ ఉంటుందో తెలుస్తుంది. సరిగ్గా సినిమా విడుదలకు ఒక నెల రోజుల ముందు ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఆదిపురుష్ ట్రైలర్ అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో?