Pooja Hegde : ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు.. దీనిపై పూజ ఏమని చెప్పిందంటే..
Pooja Hegde : తెలుగులో ఇప్పుడు టాప్ బిజీ హీరోయిన్ల జాబితాలో పూజా హెగ్డే ముందుంది. తెలుగులో తక్కువ సినిమాలు చేసినా అన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో పూజ హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ అమ్మడు జోరు చూపిస్తోంది. తెలుగులో ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో చేసిన ‘రాధేశ్యామ్’ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా విడుదల వేళ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.అందరి చేత డార్లింగ్ అనిపించుకునే ప్రభాస్ తో పూజా హెగ్డేకు చేరిందని టాలీవుడ్ లో టాక్. వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త సోషల్ మీడియాలో దావాణంలా వ్యాపించింది.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక్కరితో అంటే ఒక్కరితో కూడా ఎలాంటి నెగిటివ్ కామెంట్ వినిపించని ప్రభాస్ గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అసలు వారిద్దరి మధ్యన ఏం జరిగిందని తెలుసుకోవాలని అందరూ అనుకోగా.. దానిపై హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది.ప్రభాస్, పూజా హెగ్డేలకు చెడిందనే వార్తలపై స్పందిస్తూ.. ‘ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. నిజానికి అతను నాకు, మా అమ్మకు కూడా ఇంట్లో తయారు చేసిన భోజనం తెప్పించాడు. అతడితో పని చేయడం మంచి అనుభవం’ అని పూజా హెగ్డే తెలిపింది.

Prabhas and Pooja Hegde Conflicts between
దీంతో సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నట్లు ప్రభాస్ తో ఎలాంటి గొడవలు జరగలేదని క్లారిటీ వచ్చేసింది.తెలుగులో పూజా హెగ్డే ప్రస్తుతం చిరంజీవి సినిమా ఆచార్యలో రాంచరణ్ కు జోడీగా నటిస్తోంది. అటు తమిళంలో విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అరబిక్ కుతు పాట ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనంగా మారడం తెలిసిందే. కాగా పూజా హెగ్డే తెలుగులో ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా.. తెలుగులో టాప్ హీరోలతో పాటు, తమిళంలోనూ మంచి ఆఫర్లు అందుకుంది.