Prabhas : పెదనాన్న సంతాప సభకు ప్రభాస్ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడా.. వార్తల్లో నిజం ఎంత? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : పెదనాన్న సంతాప సభకు ప్రభాస్ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడా.. వార్తల్లో నిజం ఎంత?

 Authored By aruna | The Telugu News | Updated on :29 September 2022,6:30 pm

Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కన్నుమూశారు, ఆయన సంతాప సభ కి మొగల్తూరు వేదిక అయింది. కృష్ణంరాజు సొంత ఊరు అయిన మొగల్తూరులో భారీ ఎత్తున సంతాప సభ నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ప్రభాస్ సన్నిహితులు వారం పది రోజుల ముందు నుండే అక్కడ ఏర్పాట్లను ప్రారంభించారు. లక్ష మందికి పైగా హాజరయ్యేలా ప్రచారం చేశారు. అంతేకాకుండా అక్కడ లక్ష 20 వేల మందికి సరిపోయే ఆహార పదార్థాలను వండించాలని ముందస్తుగా ప్లాన్ చేశారు. అందుకోసం బడ్జెట్ మూడు కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ మూడు కోట్ల రూపాయలను కూడా ప్రభాస్ తన ఖాతా నుండి ఇచ్చాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మొగల్తూరులో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

కృష్ణంరాజు కుటుంబం ఏమీ ఆస్తి విషయంలో తక్కువ కాదు.. వందల కోట్ల ఆస్తి కృష్ణంరాజు ఫ్యామిలీ సొంతం, అయినా కూడా పెదనాన్న పై ఉన్న అభిమానంతో ప్రభాస్ మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరి పెదనాన్న సంతాప సభను నిర్వహించారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజం ఉందంటూ మొగల్తూరులో చాలా మంది అనుకుంటున్నారు. స్వయంగా ప్రభాస్ మూడు నాలుగు రోజుల నుండి స్థానికంగా జరుగుతున్న పనులను గురించి పర్యవేక్షిస్తున్నారని సంతాప సభ ఏర్పాట్లు చేసిన వారు కొందరు అంటున్నారు. కనుక కచ్చితంగా పెదనాన్న జ్ఞాపకార్థం తన అభిమానుల కోసం, పెదనాన్న అభిమానుల కోసం మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రభాస్ ఈ సంతాప సభ నిర్వహించారు.

Prabhas Conducting Krishnam Raju condolence meeting with huge money

Prabhas Conducting Krishnam Raju condolence meeting with huge money

ఈ సంతాప సభలో పెట్టిన భోజనం మెనూ గురించి రాబోయే ఐదు పది సంవత్సరాల వరకు కూడా అభిమానులు మరిచిపోయే పరిస్థితి లేదట. ఇంతకు భోజనంలో ఏం వడ్డించారో తెలిస్తే మీరు షాక్‌ అవ్వాలసిందే. భోజనంలో ఉన్న ఐటమ్స్ వివరాల్లోకి వెళితే.. 6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు. 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు ఉన్నాయి. జాబితా చూస్తుంటే కాస్త ఖర్చైనా మొగల్తూరు వెళ్లి రెబల్ స్టార్ ఇంట భోజనం చేస్తే బాగుండేది అనిపిస్తుంది కదా…!

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది