Prabhas : తన తండ్రి కోరికని నెరవేర్చలేకపోయిన ప్రభాస్.. తప్పు తెలుసుకొని ఇలా…!
Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే..మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బాహుబలి వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక ఈ సినిమా తర్వాత సాహో ,రాధే శ్యామ్ చిత్రాలతో అలరించే ప్రయత్నం చేయగా, అవి రెండు బోల్తా కొట్టాయి. ఇప్పుడు సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్‌తో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సంగతులు పక్కనబెడితే..ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు నిర్మాత అన్న సంగతి కొంత మందికి తెలుసు.
ప్రభాస్ తండ్రికి కూడా సినిమా ఇండస్ట్రీతో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. ప్రభాస్ తండ్రి యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.సూర్యనారాయణ రాజు తన అన్నయ్య కృష్ణంరాజుకు అండగా ఉంటూ గోపి మూవీస్ పతాకంపై కృష్ణంరాజు నటించిన చిత్రాలను నిర్మించే వారు. ఈ విధంగా ప్రభాస్ తండ్రి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన సమయంలో ప్రభాస్ ను హీరోగా పరిచయం చేయాలని ఎన్నోసార్లు భావించారు. అయితే ప్రభాస్ అందుకు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు.ఈ క్రమంలోనే తన పెదనాన్న కృష్ణంరాజుకి కొడుకులు లేకపోవడంతో తన వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించి ప్రభాస్ ను ఈశ్వర్ సినిమా ద్వారా ఆరంగేట్రం చేశాడు.
Prabhas : ఆ కోరిక తీరలేదు..
అలా వెండితెరపై ఇష్టం లేకుండా అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఇండియా స్థాయి హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని చెప్పాలి.. ప్రభాస్ లుక్స్ ఒకప్పుడు తన తండ్రి పోలికలతోఉండేవాడు. చనిపోయిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకు మాత్రం ప్రభాస్‌ను మహారాజు పాత్రలో నటిస్తే చూడాలని ఎంతగానో ఉండేది. ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు. కానీ ఆ చనిపోయిన తర్వాత ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ మహారాజు పాత్ర పోషించి తన తండ్రి చివరి కోరికను ఇలా నెరవేర్చాడు. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ నిర్మాతగా తీసిన సినిమాలు తక్కువే అయినా అన్నీ చిత్రాలు సక్సెస్ కావడం విశేషం. అప్పట్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా సూర్య నారాయణరాజు ఉన్నారు.