Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త.. శ్రీరామనవమికి రెండు ఫెస్టివల్స్ ఖాయం..!
Prabhas : బాహుబలి సినిమా తర్వాత జోరు పెంచిన ప్రభాస్ రీసెంట్‌గా రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ లో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయింది. సినిమా నెగెటివ్ టాక్ ఎక్కువగా రావడంతో రెండు మూడు రోజుల్లోనే కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి దాదాపు వంద కోట్లకు పైగా సినిమా నష్టపోయినట్లు తెలుస్తోంది. అయితే రాధే శ్యామ్ నిరుత్సాహపరచడంతో ప్రభాస్ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్ నుంచి తర్వాత రాబోయే చిత్రం ఆది పురుష్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో కనిపించబోతున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి రాబోయే అప్డేట్ కోసం ఎన్నో రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో ముగిసినా ఇంత వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. శ్రీరామనవమి సందర్భంగా అంటే ఏప్రిల్ 10న ఆదిపురుష్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ లేదా చిన్న పాటి టీజర్ వచ్చే చాన్స్ ఉందని టాక్ బయటకు వచ్చింది.

prabahs fans gets double bonanza
రాముడిగా ప్రభాస్‌ను ఆ రోజు చూపిస్తారని తెలుస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు.ఆది పురుష్ సినిమాను పూర్తిగా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. ప్రభాస్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హార్డ్ వర్క్ చేసినట్లు సమాచారం. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ మధ్య మరో గాసిప్ బయటకు వచ్చింది. సలార్, ఆది పురుష్ సినిమాలకు సీక్వెల్స్ కూడా ఉంటాయనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.