Prabhas : ఐదు సినిమాల‌కు 600 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ప్ర‌భాస్.. ఇంత ఏం చేస్తాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : ఐదు సినిమాల‌కు 600 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ప్ర‌భాస్.. ఇంత ఏం చేస్తాడు?

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇంతింతై వటుడింతై అన్నట్లు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు ప్రభాస్. దీంతో ఆ తర్వాత ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదిస్తున్నాయి. ప్ర‌భాస్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నిజానికి రాధేశ్యామ్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :10 July 2022,6:30 pm

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇంతింతై వటుడింతై అన్నట్లు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు ప్రభాస్. దీంతో ఆ తర్వాత ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదిస్తున్నాయి. ప్ర‌భాస్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నిజానికి రాధేశ్యామ్ సినిమా రిలీజ్ ముందు వరకు ప్రభాస్ రెమ్యూనరేషన్ 100 కోట్ల రూపాయలుగా చార్జి చేసేవారు.

ఆ సినిమా రిలీజ్ అయ్యి విశ్రమ స్పందన తెచ్చుకున్నాక ప్రభాస్ తన వెంట పడుతూ ఇబ్బంది. పెడుతున్న నిర్మాతలను కొంచెం దూరం పెట్టాలని నిర్ణయించి 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.120 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడు ప్ర‌భాస్. ప్రభాస్ సెట్ చేసుకున్న ఈ రెమ్యూనరేషన్ ఫిగర్ ఏ ప్రొడ్యూసర్ కు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా జస్ట్ హిట్ టాక్ వస్తేనే వెయ్యి కోట్లు ఇట్టే వస్తాయని నిర్మాతలు నమ్ముతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ లెక్కన ఐదారు వందల కోట్ల రూపాయలు ప్రభాస్ అకౌంట్‌లోకి వెళ్తున్నాయి.

prabhas going invest his remuneration money hotel

prabhas going invest his remuneration money hotel

Prabhas : కోట్ల రూపాయ‌ల సంపాద‌న‌…

మ‌రి ఇంత డ‌బ్బుని ప్ర‌భాస్ ఏం చేయ‌బోతున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. ఆ డ‌బ్బుతో ప్ర‌భాస్ బిజినెస్ మెన్ గా మారబోతున్నాడు అట.త్వరలోనే హోటెల్ చైన్ మార్కెట్ లోకి ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే తన హోటెల్ బిజినెస్ ను ఇండియాలో కాకుండా దుబాయ్, స్పెయిన్ దేశాల్లో విస్తరించాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ బిజినెస్ ప్లానింగ్ లోనే ప్రభాస్ బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం. ప్రభాస్ కు జపాన్ లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ అవుతాయో చెప్పలేం. రానున్న సినిమాల‌లో రెండు హిట్స్ అయిన ఆ క్రేజ్ వేరే లెవ‌ల్‌కి వెళుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది