Prabhas : ప్రభాస్ అసలే ఫ్లాపుల్లో ఉంటే ..ఇదేం ప్రయోగమో..?
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ అసలే వరుసగా ఫ్లాపులు చూస్తుంటే ఇప్పుడు ఆయనతో ప్రయోగం చేయడానికి దర్శకులు రెడీ అవుతున్నారు. చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ కమిటైన సినిమాలన్ని పెద్ద ప్రయోగాలే. ఏమాత్రం తేడా కొట్టిన వచ్చిన పాన్ ఇండియన్ స్టార్ అనే ఇమేజ్ అమాంతం పడిపొతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సాహో సినిమా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాగా వచ్చింది. కానీ, రొటీన్ కథ కావడంతో అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. ఇక గత చిత్రం రాధే శ్యామ్ మంచి రొమాంటిక్ లవ్ స్టోరిగా వచ్చింది. దీని ఫలితమూ అందరికీ తెలిసిందే.
అసలు కథే లేకుండా ఎలా సినిమాను చేశారో..250 కోట్ల భారీ బడ్జెట్ ఎందుకు ఖర్చు చేశారో ఎవరికీ అర్థం కాలేదు. ఇక తాజాగా సెట్స్ మీద ఉన్న సినిమాలు పెద్ద ప్రయోగాత్మకంగా రూపొందుతున్నవే. మొదటిసారి బాలీవుడ్‌లో ఎంట్రి ఇస్తూ చేస్తున్న సినిమా ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడిగాకనిపించబోతున్నాడు. అయితే, ప్రభాస్‌ను శ్రీరాముడి పాత్రలో చూస్తారా..? అంటే చాలామందిలో సందేహాలున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే యాక్షన్ సినిమాను చేస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. దీనికి కేజీఎఫ్ సినిమాల థీమ్ ఉపయోగిస్తున్నట్టు ఆ సినిమాకు ఉపయోగించినట్టుగానే యాక్షన్ సీన్స్, హీరో పాత్ర ఉండబోతున్నాయట.

Prabhas is actually in flops, this experiment
Prabhas : ఇలాంటి ప్రయోగం ప్రభాస్‌కు వర్కౌట్ అవుతుందా.?
కథ, కథనాలు కూడా కేజీఎఫ్ సిరీస్ మాదిరిగానే ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప్రయోగం ప్రభాస్‌కు వర్కౌట్ అవుతుందా..? అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి. ఇదే కాదు, ప్రాజెక్ట్ K అని సైన్ ఫిక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కథ ఏంటో రివీల్ కాకపోయినా కూడా ప్రభాస్‌కు ఈ కథ ఎంతవరకూ సూటవుతుందో తెలియదంటున్నారు. వీటి క్రమంలోనే మారుతి దర్శకత్వంలో కామెడీ, హర్రర్ చిత్రాన్ని చేయనున్నాడట. అయితే, ఇది కూడా ప్రభాస్ రేంజ్ కథ కాదని టాక్ వినిపిస్తోంది.