kalki First Day Collection : కళకళలాడుతున్న కల్కి థియేటర్స్.. తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అంటే..!
ప్రధానాంశాలు:
kalki First Day Collection : కళకళలాడుతున్న కల్కి థియేటర్స్.. తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అంటే..!
kalki First Day Collection : భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం కల్కి. ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు కొన్నేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకి ఈ చిత్రం జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక పడుకోన్, దిశా పటానీ నటించిన ఈ చిత్రం ఊహకు అందని విధంగా అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను భారీగా నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 180 కోట్ల రూపాయలుగా, కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 85 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 385 కోట్ల రూపాయలుగా నమోదైంది.
kalki First Day Collection కల్కి రికార్డ్స్..
కల్కి 2898 ఏడీ సినిమాకు అంచనాలకు మించి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులు కళకళలాడటంతో రికార్డు స్థాయిలో ఫుట్‌ఫాల్స్ నమోదు అయ్యాయి. దాంతో ఈ మూవీకి సంబంధించిన టికెట్లు పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్ లాంటి మల్టీప్లెక్స్‌లో గురువారం ఉదయం వరకు 12500 టికెట్లు అమ్ముడుపోయాయి.కలెక్షన్స్ ప్రకారం చూస్తే ఈ సినిమా భారతదేశంలో దాదాపు రూ.95 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం అయితే ఇది దాదాపు రూ.118 కోట్లు అని సమాచారం. అలాగే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కల్కికి రూ.180 కోట్లు కలెక్షన్స్ సాధించి.. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది.

kalki First Day Collection : కళకళలాడుతున్న కల్కి థియేటర్స్.. తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అంటే..!
జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి రోజే రూ.223 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ ఓపెనర్‌గా కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 ఉండగా,ఈ సినిమా తొలి రోజు రూ.217 కోట్లకు పైగా వసూలు చేసింది. వీటి తర్వాత స్థానంలో ఇప్పుడు కల్కి చేరింది. ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.180 కోట్లు కలెక్షన్ చేసి.. మూడవ స్థానంలో నిలిచింది. రానున్న రోజులలో కల్కి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.