Prabhas : స్వప్న వస్తేగాని మాట్లాడనంటూ మారం చేసిన ప్రభాస్.. ఇంతకు ఎవరా స్వప్న సుందరి?
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ పొందిన ప్రభాస్ ఆ తర్వాత వరుస ఫ్లాపులు తన ఖాతాలో చేర్చుకున్నప్పటిక ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అన్న చందాన మారింది. ఆ క్రమంలోనే ప్రభాస్ క్రేజ్‌ని పలు మూవీ నిర్మాతలు కూడా ఉపయోగించుకుంటున్నారు. అందమైన ప్రేమకథలు తెరకెక్కించే హను రాఘవపూడి సీతారామం అనే సినిమాతో ఆగస్ట్ 5న రాబోతోన్నాడు. దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ , రష్మిక మందన , సుమంత్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది.
Prabhas : ప్రభాస్ ఫన్..
మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచగా, బుధవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కి ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చాడు. స్టేజ్ మీదకు వచ్చిన ప్రభాస్.. తాను మాట్లాడనని మొండికేశాడు. స్వప్నా వస్తే గానీ తాను మాట్లాడను అని అనేశాడు. స్వప్న ఎక్కడున్నా రావాల్సిందే అని ప్రభాస్ మైకులో అరిచేశాడు. ఇంతలో స్వప్న వస్తే.. ఏంటి మేకింగ్ వీడియోలో ఇలా హీరోయిన్ కంటే ఎక్కువగా.. షాట్ వేసుకున్నావ్.. అని కౌంటర్ వేశాడు ప్రభాస్. అందరూ నీ గురించే మాట్లాడుతున్నారేంటి.. ప్రాజెక్ట్ కే కోసం ఎంతలా కష్టపడుతున్నావో నాకు తెలుసు.. మమ్మల్ని ముందు పెట్టి నువ్ వెనకాల ఉంటున్నావ్ ఏంటి.. నువ్ మాట్లాడితేనే నేను మాట్లాడతాను లేదంటే లేదు అంటూ ప్రభాస్ నవ్వులు పూయించాడు.
స్వప్న దత్ మాట్లాడిన తర్వాతే ప్రభాస్ మాట్లాడి తన మాటలతో ఆకట్టుకునేలా చేశాడు. ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఆయన డ్రెస్సింగ్, గాగుల్స్ హైలెట్‌గా నిలిచాయి. అంతేకాకుండా ప్రభాస్ కాలికి సర్జరీ అయినతర్వాత తొలిసారిగా ఈ ఈవెంట్‌లోనే కనిపించాడు. దీంతో ప్రభాస్ నడిచేందుకు కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఇక బ్లాక్ టీ-షర్ట్ మరియు డెనిమ్ జీన్స్ ధరించాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ వేసుకున్నస్టైలిష్ గాగుల్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను ఆడిటోరియంలోకి ఎంట్రీ ఇవ్వగానే.. ఒక్కసారిగా అక్కడ అంతా పండగ వాతావరణం ఏర్పడింది.