Pragathi : రోజంతా త‌న‌తో గ‌డ‌పాల‌న్న స్టార్ హీరో.. బండారం బ‌య‌ట‌పెట్టిన ప్ర‌గ‌తి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pragathi : రోజంతా త‌న‌తో గ‌డ‌పాల‌న్న స్టార్ హీరో.. బండారం బ‌య‌ట‌పెట్టిన ప్ర‌గ‌తి

 Authored By sandeep | The Telugu News | Updated on :30 August 2022,5:20 pm

Pragathi : టాలీవుడ్ న‌టి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె అనేక స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. . హీరోలకు తల్లి పాత్ర అంటే ప్రగతి మంచి ఆప్షన్‌గా ఉండేడి. అమాయకపు తల్లి అయినా, మోడ్రన్ మదర్ అయినా కూడా హీరోలకు అమ్మగా మంచి చాయిస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. నటి ప్రగతి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వ‌ర్కవుట్ వీడియోస్, డ్యాన్స్ వీడియోస్ చేస్తూ నెటిజ‌న్స్ కి మంచి వినోదాన్ని పంచుతుంది. ప్ర‌గతి ఏ పోస్ట్ పెట్టిన కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ కావ‌ల్సిందే.

Pragathi : ప్ర‌గ‌తి స్ట‌న్నింగ్ కామెంట్స్..

ఇటీవల ఓ ఇంటర్యూలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడుతూ.. తన సినీ కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా రోజంతా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది ఫీమేల్ ఆర్టిస్ట్ లు ఇబ్బందులు పడ్డారని ప్రగతి తెలిపారు. అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదట ప్రగతి. మరోవైపు ప్రగతి ముఖ్యంగా పోయిన లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. అప్పటి నుంచి తరచూ ఫిటినెస్‌ వీడియోలతో పాటు పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు.

Pragathi Comments About That Star Hero

Pragathi Comments About That Star Hero

ఇటీవ‌ల‌ పుష్ప సినిమాలోని ఊ అంటావా పాటకు అదిరిపోయే స్టెప్పులతో కేకపెట్టించారు. కాగా, ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ మహిళలు కాస్టింగ్ కౌచ్ ను ఎదురుకుంటున్నారు. అయితే సినిమా రంగం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అక్కడ ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. పలువురు సెలబ్రిటీలు తాము కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినట్టు చెబుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ ల నుండి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకూ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. శ్రీ రెడ్డి అయితే కాస్టింగ్ కౌచ్ పేరుతో నానా ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ గురించి ఎవ‌రు నోరు విప్పిన పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది