Pragya Jaiswal : పర్ఫెక్ట్ ఫిగర్ ప్రగ్యాజైశ్వాల్.. ‘అఖండ’ భామను ఇలా చూసి తట్టుకోలేరు భయ్యా.. !
Pragya Jaiswal : బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ప్రజెంట్ ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. తన సినీ కెరీర్‌లో ఈ చిత్రంలో సరైన పాత్ర దొరికిందని ఆనందపడిపోతుంది. కుర్ర హీరోయిన్ అయి ఉండి సీనియర్ హీరో బాలయ్య సరసన నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించేసింది ఈ భామ. తాజాగా ఈ భామ తన లేత అందాలను చూపుతూ దిగిన ఫొటో ఒకటి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటో ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
ప్రగ్యా జైశ్వాల్.. ఇన్ స్టా గ్రా మ్ వేదికగా షేర్ చేసిన సదరు ఫొటోలో యోగా చేస్తోంది. ‘నమ స్లే’ అనే క్యాప్షన్‌తో మందే మోటివేషన్ హ్యాష్ ట్యాగ్‌తో షేర్ అయిన సదరు ఫొటోలో ప్రగ్యా జైశ్వాల్ చాలా హాట్‌గా కనబడుతోంది. బ్లాక్ కలర్ షార్ట్.. అనగా త్రీ బై ఫోర్..రెడ్ కలర్ టాప్ ధరించి.. కాళ్ల మీద కాళ్లు వేసుకుని యోగ ముద్రలో రెండు చేతులతో అలా సూర్య నమస్కారం చేసుకున్న మాదిరిగా స్టిల్ ఇచ్చింది.
Pragya Jaiswal : కళ్లు మూసుకుని అలా కూర్చొని కాక పుట్టిస్తున్న ప్రగ్యా జైశ్వాల్..
ఇక ఈ భామ ఫొటోను చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రగ్యా హాట్ నెస్ ట్రీట్ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. ‘అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫిగర్, లవ్లీ, నైస్’ అని కామెంట్స్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రంలో ఈ భామ శరణ్య బాచుపల్లి అనే ఐఏఎస్ అధికారిణిగా కనిపించింది.