Prakash Raj : విడాకులు భార్య‌కే ఇచ్చాను.. నా పిల్ల‌ల‌కు కాదు..ప్రకాష్ రాజ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prakash Raj : విడాకులు భార్య‌కే ఇచ్చాను.. నా పిల్ల‌ల‌కు కాదు..ప్రకాష్ రాజ్

 Authored By mallesh | The Telugu News | Updated on :24 October 2021,5:05 pm

Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ, ఆయన పలు విషయాలపైన ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన వారు రాజీనామాలు చేయగా, ఇంకా వాటిని అంగీకరించలేదు మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు.ఇకపోతే మా ఎన్నికల సందర్భంగా ప్రకాశ్ రాజ్ పలు మీడియా చానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకున్నారు.తన మొదటి భార్యతో విడిపోవడానికి గల కారణాలతో పాటు తన జీవితంలో జరిగిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు ప్రకాశ్ రాజ్. తన మొదటి భార్య లలిత కుమారికి డైవోర్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాడు ప్రకాశ్.

prakash raj shared his personal life details

prakash-raj-shared-his-personal-life-details

తనకు, తన భార్య లలిత కుమారికి కొన్ని విషయాల్లో అస్సలు పడలేదని, దాంతోనే ఆమెకు విడాకులు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే, తాను తన భార్యకు మాత్రమే డైవోర్స్ ఇచ్చానని, చిల్డ్రన్స్‌కు కాదని అన్నాడు. తన పిల్లలకు తల్లిగానే తన మొదటి భార్య ఉంటుందన్నాడు. ఇక ఆ తర్వాత తాను తనకంటే వయసులో పన్నెండేళ్లు చిన్నదైన పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్‌ను మ్యారేజ్ చేసుకున్నట్లు వివరించాడు. ఇక ప్రకాశ్ రాజ్ మొదటి భార్యతో ముగ్గురు పిల్లల్ని కనగా, అందులో ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే, కొడుకు యాక్సిడెంట్‌‌లో చనిపోయాడు. తనకు మళ్లీ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించినపుడు తన పెద్ద కూతురు, మదర్, సిస్టర్‌ను అడిగిన తర్వాతనే డెసిషన్ తీసుకున్నానని ప్రకాశ్ తెలిపాడు. తన మొదటి భార్య ఇప్పటికీ తనకు స్నేహితురాలేనని చెప్పాడు. తన రెండో భార్యకు కొడుకు పుట్టాడని, వాడిన తన కూతుళ్లు తమ్ముడిగానే భావిస్తారని, వాడికి రాఖీ కడతారని తెలిపాడు.

Prakash Raj : ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రకాశ్ రాజ్..

సంతోషాలని మాత్రమే కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, బాధలను పంచుకోకూడదని ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే, తన కొడుకును కోల్పోయాననే బాధ ఇప్పటికీ తనను వెంటాడుతుందని ప్రకాశ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన మాజీ భార్య, ప్రస్తుత భార్య ఇద్దరూ బాగానే ఉంటారని, మొదటి భార్యతో రెండో భార్యకు ఎటువంటి సమస్య లేదని చెప్పుకొచ్చాడు ప్రకాశ్ రాజ్.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది