Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ బెస్ట్ ప్రోమో.. ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రియాంక..!
Bigg Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్ ‘బిగ్ బాస్’ టాస్కులు డిఫరెంట్‌గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ఇకపోతే ఈ సీజన్‌లో నాలుగో వారంలో కంటెస్టెంట్స్‌లో ఎలిమినేట్ ఎవరు అవుతారో అనే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ‘బిగ్ బాస్’ నుంచి అదిరిపోయో ప్రోమో ఒకటి విడుదలైంది. అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.‘బిగ్ […]
Bigg Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్ ‘బిగ్ బాస్’ టాస్కులు డిఫరెంట్‌గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ఇకపోతే ఈ సీజన్‌లో నాలుగో వారంలో కంటెస్టెంట్స్‌లో ఎలిమినేట్ ఎవరు అవుతారో అనే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ‘బిగ్ బాస్’ నుంచి అదిరిపోయో ప్రోమో ఒకటి విడుదలైంది. అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.‘బిగ్ బాస్’ నుంచి విడుదలైన ప్రోమోల్లో ఈ ప్రోమో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రోమో చూశాక ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూడాలి అని అనిపిస్తోందని పలువురు అభిప్రాపడుతున్నారు.
ప్రోమోకు తగ్గట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’చిత్రంలోని ‘మగువా మగువా’ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇకపోతే ప్రోమోలో ప్రియాంక ఎమోషనల్ అయిన తీరును బట్టి ఆమె టాప్ ఫైవ్‌లో ఉంటుందని పలువురు అంటున్నారు. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్ ప్రియాంక ఒకప్పడు ట్రాన్స్‌జెండర్ కాగా ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారింది. ఈ విషయం తన ఫాదర్‌కు తెలియదని చాలా సార్లు చెప్పింది.అయితే, ప్రియాంక బర్త్ డే సందర్భంగా ‘బిగ్ బాస్’ యూనిట్ ప్రియాంకకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
సాయితేజ అమ్మాయి ప్రియాంకగా మారడంపై తండ్రి మాట్లాడిన వీడియోను ప్లే చేశారు. సదరు వీడియోలో ప్రియాంక తండ్రి మాట్లాడుతూ నాన్నా సాయితేజా..
Bigg Boss 5 Telugu : ప్రియాంకకు హౌజ్ సభ్యుల సూపర్బ్ గిఫ్ట్..
అబ్బాయివి అయినా అమ్మాయివి అయినా సర్వం నువ్వే మాకు.. నువ్ అమ్మాయిగా మారావని నిన్ను ఆదరించడం మానేస్తాం అని ఎప్పుడూ అనుకోకు నాన్నా.. అని ప్రియాంక తండ్రి చెప్పాడు. ఆ వీడియో చూసి ఎమోషనల్ అయింది ప్రియాంక. ఇక ఆ తర్వాత ప్రియాంక బర్త్ డే సందర్భంగా ఆమెకు హౌజ్‌మేట్స్ చీర, గాజులు, పూలు, బొట్టు అందించారు. ప్రియాంకను అలంకరించారు. ఈ క్రమంలోనే ప్రియాంక తన తండ్రికి ఐ లవ్ యూ చెప్పింది. చివరలో మానస్ కాళ్లకు ప్రియాంక(పింకి) దండం పెట్టింది.