అమ్మో దిల్ రాజు ఆ సినిమా కొంటున్నాడు .. తేడా వచ్చింది అంటే ఆస్తులు మొత్తం అమ్ముకోవాలి బాబోయ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

అమ్మో దిల్ రాజు ఆ సినిమా కొంటున్నాడు .. తేడా వచ్చింది అంటే ఆస్తులు మొత్తం అమ్ముకోవాలి బాబోయ్ !

 Authored By aruna | The Telugu News | Updated on :9 July 2023,2:00 pm

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గత సినిమా ‘ పఠాన్ ‘ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశమంతటా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. వసూళ్లపరంగా కూడా ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లను రాబట్టిన ఇండియన్ సినిమాగా పఠాన్ నిలిచింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో షారుక్ త్వరలోనే ‘ జవాన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది కూడా పఠాన్ రేంజ్ లో విడుదల అవ్వబోతుంది. జవాన్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు హక్కులు విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిస్క్ చేయబోతున్నట్లు తెలిసింది.

ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి తెలుగు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలు కూడా వివిధ భాషలలో తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు నేటివిటీ టచ్ చేస్తూ ‘ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ‘ సినిమా చేశాడు. ఇది కథ పరంగా వర్కౌట్ కాక భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు షారుఖ్ ఖాన్ డైరెక్ట్ గా తమిళంలో ‘ జవాన్ ‘ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఇది విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా సౌత్ మార్కెట్లో క్రేజ్ పొందాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.

Dil raju

Dil raju

అలాగే ‘ జవాన్ ‘ సినిమాతో తెలుగులో మార్కెట్ అందుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారని టాక్. సాధారణంగా దిల్ రాజ్ అంటేనే ఎన్నో అంచనాలు వేసి సినిమాను కొనుగోలు చేస్తారనే టాక్ ఉంది. అయితే ఇంతవరకు షారుక్ కు తెలుగులో పెద్దగా సక్సెస్ ఏమీ లేదు. కేవలం దర్శకుడు అట్లీ మీద నమ్మకంతోనే దిల్ రాజు తెలివిగా ఈ భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలిసింది. ఏదేమైనా ‘జవాన్’ సినిమా పై దిల్ రాజు పెద్ద రిస్క్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది