Dil Raju : గేమ్ ఛేంజర్ ప్లాప్‌పై నిర్మాత దిల్ రాజు పరోక్ష కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Dil Raju : గేమ్ ఛేంజర్ ప్లాప్‌పై నిర్మాత దిల్ రాజు పరోక్ష కామెంట్స్..!
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా తన నిర్మాణంలో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై ప్రత్యక్షంగా స్పందించకపోయినా, పరోక్షంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను నా బ్యాలెన్స్ షీట్ జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకూ చూసుకుంటా, ఒక సినిమా షాక్‌లో ఉంటే శనివారం చూడలేను కదా” అంటూ చెప్పడం చూస్తే.. ఒక సినిమా ఫలితం తన వ్యాపార నిర్ణయాలపై తక్షణ ప్రభావం చూపదని, దీన్ని ఓవరాల్ వ్యాపార ప్రణాళికలో భాగంగా చూడాలని సూచించినట్లు స్పష్టం అవుతుంది.

Dil Raju : గేమ్ ఛేంజర్ ప్లాప్‌పై నిర్మాత దిల్ రాజు పరోక్ష కామెంట్స్..!
ఇక ఇటీవల సినీ పరిశ్రమను కుదిపేస్తున్న ప్రధాన సమస్య పైరసీ అని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. నిర్మాతలు తమ సినిమాల గురించి శుక్రవారం మాట్లాడతారో లేదో సోమవారానికి మర్చిపోతారని విమర్శించారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు భారీ నష్టం జరుగుతున్నా, దీన్ని నిరోధించేందుకు ఏ ఒక్కరు స్పష్టమైన ఆలోచనతో ముందుకు రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీని పూర్తిగా అడ్డుకునేలా ఒక పెద్ద ఉద్యమం అవసరమని, అందుకు తాను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా లీడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
పైరసీ సమస్యను ఎదుర్కోవాలంటే మొత్తం ఇండస్ట్రీ కలిసికట్టుగా పని చేయాలని దిల్ రాజు సూచించారు. ప్రతి నిర్మాత, నటుడు, దర్శకుడు కలిసికట్టుగా పోరాడితేనే దీన్ని అడ్డుకోవడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పైరసీ కేవలం ఒక్కొక్క సినిమా సమస్య కాకుండా మొత్తం పరిశ్రమకు ముప్పుగా మారిందని, దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. సినిమాలు థియేటర్లలో చూడటమే ప్రేక్షకుల బాధ్యతగా మారాలని, అప్పుడే పరిశ్రమ మంచి స్థాయిలో ఉండగలదని తెలిపారు.
ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే..రామ్ చరణ్ – శంకర్ కలయికలో దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారు. కానీ సినిమాకు మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ రావడం తో మేకర్స్ తో పాటు అభిమానులు షాక్ కు గురయ్యారు. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయని భావించారు కానీ రెండో రోజుతోనే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఓవరాల్ గా ఈ మూవీ వల్ల దిల్ రాజు కు భారీ నష్టాలు వచ్చాయి.