Producer Naga Vamsi : దిల్ రాజుకిస్తే మాకు ఇవ్వాల్సిందే.. గేమ్ ఛేంజర్ తో టికెట్ రేట్లపై క్లారిటీ వ‌స్తుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Producer Naga Vamsi : దిల్ రాజుకిస్తే మాకు ఇవ్వాల్సిందే.. గేమ్ ఛేంజర్ తో టికెట్ రేట్లపై క్లారిటీ వ‌స్తుందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :23 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Producer Naga Vamsi : దిల్ రాజుకిస్తే మాకు ఇవ్వాల్సిందే.. గేమ్ ఛేంజర్ తో టికెట్ రేట్లపై క్లారిటీ..!

Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఐతే తాను అధికారంలో ఉన్నంతవరకు టికెట్ రేట్లు పెంచేది లేదు.. బెనిఫిట్స్ షోస్ కూడా రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐతే ఇష్యూ ఎక్కడికో వెళ్తుందని దర్శక నిర్మాతల్లో భయ పట్టుకుంది. స్టార్ సినిమాలకు టికెట్ రేట్స్ హైక్ చేయడం, బెనిఫిట్ షోస్ వేయడం ఆనవాయితీ. ఐతే ఈమధ్య ఆ టికెట్ రేట్స్ నిర్మాతలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారన్న టాక్ ఉంది. ఐతే ఈ ఇష్యూపై ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ స్పందించారు. దిల్ రాజు అమెరికా నుంచి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని అన్నారు. అంతేకాదు దిల్ రాజు గేం ఛేంజర్ సినిమా సంక్రాంతికి మొదట రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకు టికెట్ రేట్లు హైక్ పర్మిషన్ ఇస్తే తమ సినిమాలకు పెరుగుతాయి. ఆ సినిమాకు పెరగకపోతే తమ సినిమాలకు పెరగవు అన్నారు నాగ వంశీ.

Producer Naga Vamsi ఏపీకి వెళ్లి నేను ఏం చేయగలను..

Producer Naga Vamsi దిల్ రాజుకిస్తే మాకు ఇవ్వాల్సిందే గేమ్ ఛేంజర్ తో టికెట్ రేట్లపై క్లారిటీ

Producer Naga Vamsi : దిల్ రాజుకిస్తే మాకు ఇవ్వాల్సిందే.. గేమ్ ఛేంజర్ తో టికెట్ రేట్లపై క్లారిటీ..!

ఇక ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుంది అన్న కామెంట్స్ కి కూడా వివరణ ఇస్తూ తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు ఏపీకి వెళ్లి నేను ఏం చేయగలను అని అన్నారు. ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే ఉంటుంది అన్నట్టుగా నాగ వంశీ మాట్లాడారు. ఐతే సంధ్య థియేటర్ ఇష్యూ లాంటిది మళ్లీ రిపీట్ అవ్వకూడదనే బెనిఫిట్ షోస్ ఇక వద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఐతే దిల్ రాజు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి ఆయన వచ్చాక ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.

అంతేకాదు టాలీవుడ్ ప్రముఖులంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్నా జరిగిన ఒక సంఘటన వల్ల ఇక మీదట టికెట్ రేట్లు పెంచేది లేదని సీఎం చేసిన ప్రకటన పై నిర్మాతలు కాస్త షాక్ అవుతున్నారు. Producer Naga Vamsi , CM Revanth Reddy, Telangana, Dil Raju

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది