Pawankalyan : తగ్గేదేలే అంటున్న భీమ్లానాయక్.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawankalyan : తగ్గేదేలే అంటున్న భీమ్లానాయక్.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..

 Authored By mallesh | The Telugu News | Updated on :8 December 2021,4:20 pm

Pawankalyan : ప్రతి ఏడాదీ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వస్తుంటాయి. చాలా మంది హీరోలకు ఈ సంక్రాంతి సెంటిమెంట్ చాలా కలిసొచ్చింది కూడా. కానీ ఈ సారి పెద్ద సినిమాలో రంగంలోకి దిగుతున్నాయి. అయితే జనవరి 7న ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. అనౌన్స్‌మెంట్ సైతం వచ్చేసింది. టాప్ హీరోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే వీటికి తోడుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన రాధేశ్యామ్, అక్కినేని నాగార్జున యాక్ట్ చేసిన బంగార్రాజు మూవీస్ సైతం విడుదల అవుతున్నాయని టాక్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటిని తెరదించుతూ రిలీజ్ డైట్ పై క్లారిటీ ఇచ్చాడు మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ. లాల్ భీమ్లా రష్ చూశానని.. జనవరి 12న థియేటర్స్‌లో బ్లాస్ట్ చేసేందుకు ఫ్యాన్ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశాడు.అయితే భీమ్లా నాయక్ మూవీ వాయిదా పడుతున్నట్టు వస్తున్న వార్తలకు మెయిన్ రీజన్ ఆర్ఆర్ఆర్ మూవేనని టాక్.

producer tweets on Bheemla Nayak movie release date

producer tweets on Bheemla Nayak movie release date

Pawankalyan : కారణం ఏంటంటే..?

కేవలం 5 రోజుల గ్యాప్‌లోనే రెండు పెద్దహీరోల మాస్ మూవీస్ రిలీజ్ అయితే.. తెలంగాణ, ఏపీలో అందుకు సరిపడా థియేటర్స్ అందుబాటులో లేకపోవడమేనని టాక్? అయితే ఇప్పటి వరకు డైలమాలో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్.. ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్‌తో హంగామా చేయడం మొదలు పెట్టారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ నెల చివర్లో భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చే చాన్స్ ఉందని టాక్. దాని కోసం పవర్ స్టార్ ఫ్యాన్ ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. ఇక మూవీ రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది