Chiranjeevi : చిరంజీవి తో సినిమా చేసి ఆస్తులు మొత్తం అమ్ముకున్న ఆ నిర్మాత ఎవరో తెలుసా…!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన గురించి ఎంత చెప్పినా అప్పటికీ తక్కువే అవుతుందని అందరికి తెలుసు. ఒక నటుడిగా, రాజకీయవేత్తగా ఇలా ఎన్నో రకాలుగా తనలో ఉన్న ప్రతిభను చూపించి, ఇటు ప్రేక్షకులకు అటు ప్రజలకు బాగా దగ్గరయ్యారు చిరంజీవి. ఎంతోమంది స్టార్ దర్శకులు, అగ్ర నిర్మాతలతో కలిసి ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఈయన సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే వాటితో పాటు చిరంజీవి సినీ కెరీర్ లో కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాప్ సినిమాలు తీసిన కొందరు నిర్మాతలు ఆర్థికంగా కుదేలై నష్టపోయారట.
అలాంటి సమయంలో చిరంజీవి ఆ నిర్మాతలకు మరో సినిమా చేసి వారు ఆర్థికంగా కోలుకునేందుకు కొంత వరకు సాయం చేశారని సమాచారం. ఇదిలా ఉంటే చిరంజీవితో భారీ బడ్జెట్ సినిమా తీసిన ఓ అగ్ర నిర్మాత ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆర్థికంగా నష్టపోయారట. ఆ తర్వాత ఆయన ఆస్తులు అన్ని కూడా అమ్ముకున్నారనే న్యూస్ ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది.మెగాస్టార్ తో ఘరానా మొగుడు చిత్రాన్ని కె. దేవీ వరప్రసాద్ నిర్మించారు. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాకే చిరు తొలిసారిగా ఓ సినిమాకు రు. కోటి రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత 2001లో
గుణశేఖర్ దర్శకత్వంలో మృగరాజు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి కూడా దేవీ వరప్రసాదే ప్రొడ్యూసర్.
Chiranjeevi : ఫ్లాప్ అయితే పట్టించుకునే వారు కాదు..:
అప్పట్లోనే రు. 15 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ… పెద్ద డిజాస్టర్ అయి భారీ నష్టాలను చవిచూసింది.ఆ రోజుల్లో మూవీ హిట్ అయితేనే చిరు నిర్మాతలతో క్లోజ్ గా మూవ్ అవుతారని… మూవీ ఫ్లాప్ అయితే అసలు వారిని పట్టించుకోరని సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.దేవీ వరప్రసాద్ అమెరికాకు వెళితే చిరంజీవికి షాపింగ్ చేసి మరీ వస్తువులు కొని తెచ్చేవారని కూడా ఆయన గుర్తు చేశారు. కాగా చివరకు అదే చిరంజీవి సినిమా ప్లాప్ అయ్యాక ఆయన ఆస్తులు మొత్తం అమ్ముకున్నారని.. తర్వాత ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోలేదని ప్రసాద్ చెప్పుకొచ్చారు.