Pushpa Fame Jagadeesh : “పుష్ప” ఫేమ్ జగదీష్…”పుష్ప 2″ పై సంచలన వ్యాఖ్యలు..!!

Advertisement

Pushpa Fame Jagadeesh : 2021లో సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” పాన్ ఇండియా స్థాయిలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఈ సినిమాలో “పుష్ప” అసిస్టెంట్ గా కేశవ పాత్రలో చేసిన జగదీష్ సినిమాకి చాలా హైలెట్ కావటం తెలిసిందే. మొదటి సినిమాతోనే చాలా మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో మనోడికి గుర్తింపు లభించింది. మనోడు “పుష్ప 2” లో కూడా నటిస్తున్నాడు. “పుష్ప 2” కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.

Pushpa movie actor Jagadeesh Prathap gets emotional after winning "Best  Actor in Supporting Role" - YouTube

Advertisement

ఇటీవలే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అనేక రికార్డులు సృష్టించటం తెలిసిందే. ఇలా ఉంటే లేటెస్ట్గా “సత్తి గాని రెండెకరాలు చాప్టర్ 1” అనే సినిమాలో జగదీష్ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అనీష్ దామా, బిత్తిరి సత్తి తదితరులు ఇతర పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అభినవ్ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. ఈనెల 26న ఆహా ఓటిటిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జగదీష్ మాట్లాడుతూ “పుష్ప” సినిమా పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Pushpa Fame Jagadeesh Gave Superb Update About Pushpa 2 Movie
Pushpa Fame Jagadeesh Gave Superb Update About Pushpa 2 Movie

జీవితంలో ఈ స్థానంలో రావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ సుకుమార్ మరియు హీరో అల్లు అర్జున్ అని అందుకు గాను కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో “పుష్ప 2” లో తనపై పెట్టుకున్న నమ్మకానికి కచ్చితంగా న్యాయం చేస్తానని జగదీష్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అయితే తాను లీడ్ రోల్ ఈ సినిమా చేస్తున్నట్లు బన్నీ సార్ కి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. “పుష్ప” సినిమా చేస్తున్న సమయంలోనే.. సుకుమార్ సార్ కచ్చితంగా నువ్వు హీరో అవుతావు అని అన్నారు. ఆ రకంగా “సత్తి గానికి రెండు ఎకరాలు” సినిమాలో హీరో చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు జగదీష్ స్పీచ్ ఇచ్చారు.

Advertisement
Advertisement