Rahul sipligunj : రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు.. అరెస్ట్ అయిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్..!
Rahul sipligunj : రాహుల్ సిప్లిగంజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. తన పాటతో ప్రేక్షకులని ఎంతగానో అలరించే రాహుల్ సిప్లిగంజ్ ఎక్కువగా వివాదాలతో వార్తలలోకి ఎక్కుతుంటాడు. తాజాగా ఆయన పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. నగరంలో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలోనే పోలీసులపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఏదొక రూపంలో నగరంలోకి డ్రగ్స్ సరఫరా అవుతూనే ఉంది. ఐటీ ఉద్యోగులు, బడాబాబుల పిల్లలు డ్రగ్స్ వినియోగించడం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇటీవల డ్రగ్స్‌కు బానిసైన ఓ బీటెక్ విద్యార్థి చివరికి ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ ప్రజలు ఉలిక్కిపడ్డాయి.
తాజాగా నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్‌లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్‌లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పబ్‌ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన సమయంలో యజమానితో సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.వీరిలో బిగ్‌బాస్ విన్నర్, టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండటంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పబ్‌లో నిర్వహించిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లుగా తెలుస్తోంది.

rahul sipligunj arrested in rave party
Rahul sipligunj : మరోసారి బుక్కయ్యాడా..
ఈ పార్టీలో అనేక మంది యువతులు కూడా పాల్గొన్నారు. అయితే మత్తులో ఉన్న యువకులు ఠానాలో హంగామా చేశారు. తమను ఎందుకు తీసుకువచ్చారని ఆందోళనకు దిగారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 39 మంది యవతులు, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. నిర్వాహకులపై కేసు నమోదుచేసిన పోలీసులు.. హోటల్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. కాగా, రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా పాటలు పాడుతూ అలరిస్తున్న విషయం తెలిసిందే.