Rahul Sipligunj : మీడియాపై మండి పడ్డ రాహుల్ సిప్లిగంజ్.. డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు
Rahul Sipligunj : హైదరాబాద్‌లోని పబ్‌లో కలకలం సృష్టించిన డ్రగ్స్ పార్టీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులు జరిపిన దాడిలో నిహారిక, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ కొడుకులు, మాజీ డీజీపీ కూతురు, పలువురు బడాబాబులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలూ ఉన్నట్లూ వెల్లడైంది. పార్టీకి కోడ్ లాంగ్వేజ్ ద్వారా డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు కునాల్, వంశీధర్‌రావు చాట్‌లో వీఐపీలున్నట్లు తెలుస్తోంది.ఉదయం నుండి ఈ ఘటనకు సంబంధించి పలు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు.
ఈ పార్టీలో తను అసలు డ్రగ్స్ తీసుకోలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికి చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నాడు. అలాగే లేట్‌నైట్ వరకు పబ్ నిర్వహిస్తుంటే యాజమాన్యాన్ని నిలదీయాలి, కానీ ఇలా మమ్మల్ని పలిచి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని, ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేనప్పడు తాను భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ పేర్కొన్నాడు. తన శాంపిల్స్ ఇవ్వడానికి ఎప్పుడైనా రెడీఅన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఈ సారి తానే పట్టిస్తానని చెప్పారు.

rahul sipligunj gives clarity on Rave Partie
Rahul Sipligunj : ఇలా క్లారిటీ ఇచ్చారు..
తప్పు చేయకపోయినా తనపై వివాదాలు సృష్టిస్తున్నారని రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసులో నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని నాగబాబు ఓ సందేశాన్ని విడుదల చేశారు. ‘పబ్‌లో నిహారిక ఉండడం వల్లే నేను స్పందిస్తున్నాను. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారనే.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. నా కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్. నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారు. ఊహాగానాలకు తావివ్వకూడదనే దీనిపై స్పందిస్తున్నాను. ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని నాగబాబు పేర్కొన్నారు. నాగబాబు వీడియో సందేశం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ మీడియాతో మాట్లాడారు..
