'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్లు మరి ఇంత దారుణమా ?

The Raja Saab First Day Collection : ‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు మరి ఇంత దారుణమా ?

 Authored By sudheer | The Telugu News | Updated on :10 January 2026,8:24 am

ప్రధానాంశాలు:

  •  'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ల రిపోర్ట్

  •  The Raja Saab Movie : రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్లు మరి ఇంత దారుణమా ?

The Raja Saab First Day Collection : ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజాసాబ్’ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం సాదించింది.. అయినప్పటికీ తొలిరోజు మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. సాక్నిల్క్ (Sacnilk) నివేదికల ప్రకారం, ఈ చిత్రం ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేయగా, ప్రీమియర్ షోలతో కలుపుకుని మొత్తం రూ.54 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఒక హారర్-కామెడీ జోనర్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషమే అయినప్పటికీ, ప్రభాస్ గత చిత్రాలైన ‘కల్కి’ లేదా ‘సలార్’ రేంజ్ ఓపెనింగ్స్‌ను ఇది అందుకోలేకపోయింది. దీనికి తోడు తెలంగాణలో టికెట్ ధరల పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేయడం వసూళ్లపై కొంత ప్రభావం చూపింది, అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెంపు కొనసాగుతుండటం మేకర్స్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం.

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు మరి ఇంత దారుణమా ?

The Raja Saab First Day Collection ‘రాజాసాబ్’వరల్డ్ వైడ్ కలెక్షన్లు

ఇక సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా #DisasterRajaSaab అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభాస్‌ను సరికొత్త వింటేజ్ లుక్‌లో చూడాలని ఆశించిన అభిమానులకు, సినిమాలో కొన్ని కామెడీ సీక్వెన్సులు మరియు కథనంలోని లోపాలు నిరాశ కలిగించాయని తెలుస్తోంది. యాంటీ ఫ్యాన్స్ మరియు కొంతమంది అసంతృప్తి చెందిన ప్రేక్షకులు ఈ నెగిటివ్ ట్రెండింగ్‌లో భాగస్వాములయ్యారు. ఏదైనా పెద్ద సినిమా విడుదలైనప్పుడు ఇలాంటి ట్రెండ్స్ రావడం సహజమే అయినా, ఇది సామాన్య ప్రేక్షకులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

The Raja Saab First Day Collection సలార్ , కల్కి కలెక్షన్లను అందుకోలేకపోయిన రాజాసాబ్

దర్శకుడు మారుతి మేకింగ్ శైలిపై ప్రభాస్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ వంటి పాన్-ఇండియా స్టార్‌ను డీల్ చేయడంలో మారుతి విఫలమయ్యారని, కేవలం కామెడీ మీద దృష్టి పెట్టి కంటెంట్‌ను వదిలేశారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మారుతి కనిపించకూడదు అన్నంతగా కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్టుగా ఎలివేషన్లు లేకపోవడం, కథలో బలం లేకపోవడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణం. సినిమా లాంగ్ రన్ లో నిలబడాలంటే వీకెండ్ తర్వాత వచ్చే సాధారణ ప్రేక్షకుల ఆదరణే కీలకం కానుంది.

Also read

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది