NTR – Rajamouli : ఎన్టీఆర్ కు విష్ చేయని జక్కన్న..ఆర్ఆర్ఆర్ వల్ల గ్యాప్ వచ్చిందా..?
NTR – Rajamouli : మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ నుంచి ఇతర భాషలలోనీ సినీ ప్రముఖులందరూ తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాం చరణ్ అయితే, తనతో ఉన్న ఓ అద్భుతమైన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసి అద్భుతమైన పదాలతో ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు, రకుల్ ప్రీత్‌సింగ్, దర్శకులు శ్రీనువైట్ల, బుచ్చిబాబు, పలువురు ట్వీట్స్ చేశారు. కానీ, వీరందరికంటే కూడా ఎక్కువగా అభిమానులు ఎదురుచూసింది దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పోస్ట్ గురించి.

rajamouli did not wish ntr
కానీ, రాజమౌళి ఎక్కడా కూడా తారక్‌కు బర్త్ డే విషెస్ తెలపలేదు. ఇప్పుడుది నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్.టి.ఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని. కానీ, హీరోగా పాపులర్ అయింది మాత్రం రాజమౌళి దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం అవుతూ తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ 1. ఈ సినిమా దర్శకుడిగా రాజమౌళికి హీరోగా ఎన్.టి.ఆర్ కి మెమరబుల్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి రాజమౌళి – తారక్‌ల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఎన్.టి.ఆర్ రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టాడు. రాజమౌళి తారక్ అని ముద్ధుగా పిలుస్తుంటారు.
NTR – Rajamouli: ఎన్.టి.ఆర్‌తో రాజమౌళి ఏ సినిమా చేసినా చాలా ప్రత్యేకంగా చూపిస్తారు.
ఎన్.టి.ఆర్‌తో రాజమౌళి ఏ సినిమా చేసినా చాలా ప్రత్యేకంగా చూపిస్తారు. అయితే, ఇటీవల వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన పోషించిన కొమురమ్ భీమ్ పాత్ర చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజుకు కంటే తక్కువగా ఉందని అభిమానులు ఫీలయిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో నిజంగా తారక్ అసంతృప్తిగా ఉన్నాడా..అందుకే, తారక్ – రాజమౌళి మధ్య గ్యాప్ వచ్చిందా..దీనివల్లనే తారక్‌కు జక్కన్న బర్త్ డే విషెస్ చెప్పలేదా..? అనేది తెలియదు గానీ, ఇప్పుడు ఇదే మ్యాటర్ అంతటా వైరల్ అవుతోంది. మరి దీనిపై తారక్ లేదా జక్కన్న గానీ క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలుస్తుంది.