SS Rajamouli : నా డ్రైవర్ తిట్టడం వల్లే మారిపోయా.. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
SS Rajamouli : దర్శకధీరుడు రాజమౌళికి ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలే ఈ క్రేజ్ తెచ్చిపెట్టాయనడంలో అతిశయోక్తి లేదు. మగధీర, ఈగ, బాహుబలి బిగినింగ్, బహుబలి ది కన్ క్లూజన్ సినిమాతో ఆయన ఇంతటి స్థాయికి చేరుకున్నారు. రాజమౌళి ఏ సినిమా తీసినా రెండు నుంచి మూడేళ్ల టైం తీసుకుంటారు. బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది. దానికి రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం రాజమౌళి ప్రత్యేకత అని చెప్పవచ్చు. అయితే, రాజమౌళిని ఆయన వ్యక్తిగత డ్రైవర్ తిట్టడం వల్లే మారానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రాజమౌళి ‘ఈగ’ సినిమా తెరకెక్కించి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. బడ్జెట్ తక్కువే అయినా ఈ సినిమా మంచి కలెక్లన్లు రాబట్టింది. ఈ సినిమాలో కన్నడ సూసర్ స్టార్ కిచ్చా సుదీప్‌కు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. అయితే, ఈ సినిమా విడుదలయ్యాక ఓ రోజు కారులో వెళుతున్నప్పుడు డ్రైవర్ రాజమౌళిపై సీరియస్ అయ్యారట. జంతువులు, కీటకాలు మీద సినిమాలు కాకుండా మనుషుల మీద సినిమాలు తీయండి అన్నారట. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యినట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే RRR సినిమా ముంబై ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ టాక్ షోలో చెప్పుకొచ్చారు.
SS Rajamouli : డ్రైవర్ తిట్టేంత పని జక్కన్న ఏం చేశాడు
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా RRR చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. దీనికి డివివి దానయ్య నిర్మాతగా వ్యహరించారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ తదితరులు నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ఈ సినిమా థియేటర్ల ముందుకు వస్తుందో అని మూవీ మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.