రాజమౌళి మామూలోడు కాదు .. మహేష్ బాబు సినిమా ముందర ఏం చేస్తున్నాడో చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

రాజమౌళి మామూలోడు కాదు .. మహేష్ బాబు సినిమా ముందర ఏం చేస్తున్నాడో చూడండి !

బాహుబలి, RRR సినిమాలతో భారతీయ చలనచిత్రంగా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పెంచేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ రెండు సినిమాలు సృష్టించిన రికార్డులు ప్రపంచస్థాయిలో టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరిలో రాజమౌళిని కూడా చేర్చడం జరిగాయి. దీంతో ఇప్పుడు జక్కన్న తీయబోయే మహేష్ బాబు ప్రాజెక్టుపై ప్రపంచ సినిమా రంగం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. పరిస్థితిలో ఉంటే ఏదైనా సినిమా స్టార్ట్ చేశాడంటే రాజమౌళి చాలా సంవత్సరాలు పాటు ఇంకా పూర్తిగా సినిమాపైనే పనిచేస్తుంటారు అన్న సంగతి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :29 June 2023,1:00 pm

బాహుబలి, RRR సినిమాలతో భారతీయ చలనచిత్రంగా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పెంచేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ రెండు సినిమాలు సృష్టించిన రికార్డులు ప్రపంచస్థాయిలో టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరిలో రాజమౌళిని కూడా చేర్చడం జరిగాయి. దీంతో ఇప్పుడు జక్కన్న తీయబోయే మహేష్ బాబు ప్రాజెక్టుపై ప్రపంచ సినిమా రంగం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. పరిస్థితిలో ఉంటే ఏదైనా సినిమా స్టార్ట్ చేశాడంటే రాజమౌళి చాలా సంవత్సరాలు పాటు ఇంకా పూర్తిగా సినిమాపైనే పనిచేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు విజేత ప్రసాద్ చూసుకుంటూ ఉన్నారట.

ఈ క్రమంలో మహేష్ సినిమాకి ముందు రాజమౌళి పూర్తిగా ఫుల్ రిలాక్స్ అవుతున్నారట. దీనిలో భాగంగా కుటుంబంతో కలిసి తమిళనాడులో టూర్ ప్లాన్ చేయడం జరిగిందట. తుత్తుక్కుడి రిసార్ట్స్ లోకి భార్య రామా కొడుకు కార్తికేయ కూతురు మా యొక్క తో పాటు మరి కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళటం జరిగిందట. అంతేకాదు అక్కడ కొన్ని మొక్కలు కూడా నాటడం జరిగిందట. ఈ రకంగా మహేష్ సినిమా స్టార్ట్ అవ్వకముందు రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి పూర్తిగా విశ్రాంతి తీసుకునే రీతిలో టూర్స్ వేస్తూ ఉన్నారట. ఇక మహేష్ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

rajamouli mahesh movie New Update

rajamouli mahesh movie New Update

అంతేకాదు ఈ సినిమాని రెండు మూడు భాగాలుగా తెరకెక్కే రీతిలో ప్లాన్ చేస్తున్నారట. దాదాపు ₹800 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి జక్కన్న దింపుతున్నట్లు.. వార్తలు వస్తున్నాయి.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది