Dhanush Aishwarya : ధనుష్, ఐశ్వర్యని కలపడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న రజనీకాంత్..!
Dhanush Aishwarya :ఈ మధ్య సెలబ్స్ చిన్న చిన్న విషయాలకు విడాకులు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, నటుడు ధనుష్ దంపతులు ఇటీవలే విడిపోతున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న వీరు సోషల్ మీడియాలో ప్రకటన ద్వారా విడిపోతున్నట్టు తెలియజేశారు. అయితే ఈ ఇద్దరూ ఇంకా చట్టబద్ధంగా విడిపోలేదని తెలుస్తోంది. ఇక ధనుష్, ఐశ్వర్య మాత్రం విడాకుల వ్యవహారం కేవలం కుటుంబ కలహాల వంటిది మాత్రమే అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యానించారు.విడిపోయిన తర్వాత ధనుష్ , ఐశ్వర్య రజనీకాంత్ హైదరాబాద్‌లోని ఒకే హోటల్‌లో దిగినట్లు సమాచారం. కాని వారు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.
18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం రజనీకాంత్‌ని ఎంతో బాధించింది. ఈ క్రమంలో ఆయన వారిద్దరిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ధనుష్, ఐశ్వర్య విడిపోయారన్న వార్త అభిమానులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కలచివేస్తోంది. ముఖ్యంగా ఈ విషయాన్ని ఐశ్వర్య తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్ జీర్ణించుకోలేకపోతున్నారు.కూతురు, అల్లుడు విడిపోదామని నిర్ణయించుకున్నప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. కూతురి జీవితాన్ని చక్కదిద్దాలని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నారట.ఇప్పటికే ఆయన ఈ విషయమై ధనుష్, ఐశ్వర్యలతో ఫోన్‌లో మాట్లాడి తన అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం.

rajinikanth advice to his Dhanush Aishwarya
Dhanush Aishwarya : మనోవేదన చెందుతున్న తలైవా..!
ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి రజినీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రజనీకాంత్ కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఐశ్వర్య, ధనుష్ జనవరి 17 న ఉమ్మడి ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో తమ విడిపోతున్నట్లు ప్రకటించారు. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే సమంత సోషల్ మీడియాతో తనలో అక్కినేనిని తీసేసింది. రూత్ ప్రభును పెట్టుకుంది. కానీ ఐశ్వర్య మాత్రం ఇంకా ధనుష్ పేరును తొలగించలేదు.