Rajinikanth : ఏపీ అసెంబ్లీ ఘటనపై స్పందించిన రజనీకాంత్..!
Rajinikanth : టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన భార్యను కించపరిచారని పేర్కొంటూ చంద్రబాబు మీడియా సాక్షిగా కన్నీటి పర్యంతమైన వీడియోలు చూసి చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ, వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, తాజాగా ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుసుకున్నారు.నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇతరులు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయడుకు రజనీకాంత్ ఫోన్ చేసి ఘటన పట్ల విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Rajinikanth : ఫోన్‌లో చంద్రాబుతో సంభాషించిన సూపర్ స్టార్.. !

rajinikanth rajinikanth phone call to chandrababu on ap assembly incidents
చంద్రబాబుకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఇకపోతే చంద్రబాబు సతీమణిని దూషించడం పట్ల ఇప్పటికే ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్, నాగబాబు వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఒకప్పుడు టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిని కించపరచడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, తాము ఎన్టీఆర్ వద్ద క్రమశిక్షణ, విలువతో పెరిగామని బీజేపీ మహిళా నాయకురాలు, సీనియర్ ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి కూడా తెలిపారు. వైసీపీ నేతలకు ఈ విషయమై వార్నింగ్ కూడా ఇచ్చారు.
మొత్తంగా ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన ఘటన, ఆ తర్వాత వెను వెంటనే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా చకచకా జరిగిపోయాయి. మొత్తంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి మధ్య అప్పుడే యుద్ధం మొదలైంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ ఏపీ రాజకీయ క్షేత్రంలో అప్పుడే యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఏపీ అసెంబ్లీలో ఉన్నటువంటి వైసీపీ సభ్యులను, ప్రభుత్వ సభను కౌరవ సభతో పోల్చిన చంద్రబాబు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమయినట్లు టీడీపీ శ్రేణులకు ఇన్ డైరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చేశాడు.