Rajinikanth : రజనీకాంత్ ఆస్తుల విలువ.. అన్ని కోట్లా..!
Rajinikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ తలైవాగా, స్టైల్‌కు కేరాఫ్‌గా నిలిచే రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులున్నారు. ఇక ఆయన నటించిన చిత్రాలు కేవలం తమిళ భాషలోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదలవుతుంటారు. బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్.. ఇటీవల సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. రజనీ ఆదివారం 71వ జన్మదినం సెలబ్రేట్ చేసుకున్నారు.
రజనీకాంత్ కు ఉన్న ఆస్తులు ఎంత విలువ గలవి అనే విషయమై స్పెషల్ స్టోరి..సింప్లిసిటీకి కేరాఫ్‌గా ఉంటారు రజనీకాంత్. వెండితెరపైన ఎంత స్టైలిష్ గా కనిపించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం రజనీకాంత్ చాలా నార్మల్‌గా ఉంటారు. ఎటువంటి ఈగో లేకుండా తన పనులు తానే చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు రజనీ. పద్మవిభూషణ్ అవార్డుతో పాటు సినిమా రంగంలో సేవలకుగాను చాలా అవార్డులు అందుకున్నారు రజనీకాంత్. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం చాలా కాలం పాటు జరిగింది. అయితే, తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని రజనీ స్పష్టం చేశారు.
Rajinikanth : సేవా కార్యక్రమాల్లో రజనీకాంత్‌ది తనదైన మార్క్..
తాను మరణించిన తర్వాత తన ఆస్తులన్నీ తన ప్రజలు, తమిళనాడుకే చెందుతాయని రజనీ ప్రకటించారు. రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకునే స్టార్ హీరోల్లో రజనీకాంత్ ఒకరని చెప్పొచ్చు. అయితే, సేవాకార్యక్రమాల కోసం డబ్బులు ఇవ్వడంలోనూ రజనీ ముందుంటారు. రజనీకాంత్ ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటారని సమాచారం. రజనీకాంత్ కు ఉన్న ఆస్తుల నికర విలువ రూ.365 కోట్లు అని తెలుస్తోంది. రజనీకాంత్‌కు చెన్నై సిటీలో లగ్జరియస్ హౌజ్ ఉంది. ఏదేని సినిమా ఫ్లాప్ అయితే రజనీకాంత్ ప్రొడ్యూసర్ లాస్ కాకుండా ఉండేందుకుగాను తన రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. రజనీ కాంత్ నటించిన ‘అన్నాత్తె’ ఫిల్మ్ దీపావళి సందర్భంగా విడుదలైంది. తెలుగులో ‘పెద్దన్న’ పేరిట రిలీజ్ అయింది ఈ చిత్రం.