Rakesh Master : జబర్ధస్త్‌లో ఫుడ్ నీచంగా ఉంటుందని రాకేష్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
Rakesh Master: గత కొద్ది రోజులుగా జబర్ధస్త్ వ్యవహారం ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కిరాక్ ఆర్పీ ఇటీవల జబర్ధస్త్ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. అక్కడి ఫుడ్ బాలేదని సంచలన కామెంట్స్ చేశారు. కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ ని కొట్టిపారేస్తూ.. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తిరిగి విమర్శలు గుప్పించారు. అయితే.. అటు ఆర్పీ మాటలపై, ఇటు ఆది, రాంప్రసాద్ కామెంట్స్ పై క్లారిటీ ఇస్తూ జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు క్లారిటీ ఇచ్చారు. అయితే జబర్దస్త్ లోకి రీసెంట్ గా వెళ్లి కొద్దిరోజులకే బయటికి వచ్చిన రాకేష్ మాస్టర్ ఇదే విషయంపై మాట్లాడారు.
Rakesh Master : రాకేష్ షాకింగ్ కామెంట్స్…
జబర్దస్త్ లో ఫుడ్ బ్యాడ్ అని చెప్పిన రాకేష్ మాస్టర్.. కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ వీడియోలో చూశానని, అతను ఫుడ్ విషయంలో చెప్పింది వాస్తవమేనని చెప్పడం గమనార్హం. జబర్దస్త్ ఫుడ్ విషయంలో బ్యాడ్.. ఏమైందో తెలీదు అంటూ రాకేష్ మాస్టర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ అతనికి మద్దతుగా నిలబడ్డారు.
మిగిలిన జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలలో నిజం లేదు అంటూ మాట్లాడగా రాకేష్ మాస్టర్ మాత్రం కిరాక్ ఆర్పీ నిజమైన మగాడిలా అక్కడున్న పరిస్థితుల గురించి బయట పెడుతూ మాట్లాడారు. అక్కడ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడటానికి చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ భయపడతారు కానీ ఆర్పీ మాత్రం ఎంతో ధైర్యంగా ఆ నిజాలు బయట పెట్టారని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.ప్రస్తుతం రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాకేష్ ఆ మధ్య మాట్లాడుతూ.. బుల్లెట్ భాస్కర్ కూడా తన భోజనాన్ని బయట నుంచి తెప్పించుకుంటాడు. తన టీంకు తెప్పిస్తాడు. అక్కడ భోజనం బాగుంటే.. బయటి నుంచి ఎందుకు తెప్పించుకుంటాడు అని అన్నాడు.