Rakesh Master : రాకేశ్ మాష్టర్ చనిపోయిన 12 గంటల్లో ఊహించని బిగ్ న్యూస్ !
Rakesh Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రముఖ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేయడం జరిగింది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ మృతి అందరిని కలచివేసింది. ఆదివారం ఉదయం ఆయన రక్త విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడవటం జరిగింది. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ అందించడం జరిగింది.
ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ లుగా చలామణి అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం అనారోగ్యానికి గురి కావటం ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు జాయిన్ చేయగా.. ఆయన మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆల్రెడీ రెండు నెలల క్రితమే హనుమాన్ అనే సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రాకేష్ మాస్టర్ కి రక్తపు విరోచనాలు మరియు వాంతులు అయ్యాయట. ఆ సమయంలోనే వైద్యులు ఈయన బతకటం చాలా కష్టమని కుటుంబ సభ్యులకు సూచించారట.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంటిలో ఉన్న సమయంలో రాకేష్ మాస్టర్ కాళ్లు చేతులు పడిపోయినట్లు.. పక్షవాతంలా ఉందని రిషికమ్మ.. గుర్తించి మిగతా సహచరులకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందట. వెంటనే గాంధీ హాస్పిటల్ లో జాయిన్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.